High Salary India: నేటి కాలంలో కొత్తగా ఉద్యోగం ఎవరికి ఉద్యోగం వచ్చినా.. మహా అయితే రూ. 3 నుంచి 5 లక్షల వరకు జీతం ఉంటుంది. కాస్త పెద్ద క్యాటగిరి అయితే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొందరు కోట్ల రూపాయల జీతాన్ని ఎత్తుతున్నారు. మన భారతదేశంలోనే చదువుకొని.. ఇక్కడి వాతావరణం లోనే పెరిగి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు పొందుతున్నారు. వీరి గీతం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిన పని అవుతుంది. ఇంతకీ మన భారతదేశంలో చదివి బయట దేశాల్లో అత్యధిక జీతాలు పొందుతున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు ఎవరో ఒకరు వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అని వినే వాళ్ళం. కానీ ఇప్పుడు కోట్ల రూపాయల జీతాన్ని పొందుతున్నారని రోజుకో వార్త వినాల్సి వస్తుంది. మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల మధ్య పోటీ పెరిగి ఉన్నత చదువులను చదువుతూ.. వ్యక్తిగతంగా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి పేరు తెస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం..
Also Read: హరి హర వీరమల్లు పై చిరు, చరణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?
ఇండియాకు చెందిన త్రపిత్ కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ చేశాడు. ఆ తర్వాత ఓపెన్ ఏఐ అనే సంస్థలో సైంటిస్ట్ గా పని చేశారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం పనిచేసిన ఈయన ఇప్పుడు మెటా సంస్థలో చేరిపోయాడు. మెటా అనగానే అందరికీ గుర్తుకు వస్తుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన ఇందులో భారత్కు చెందిన త్రపిత్ కూడా ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం ఈయన జీతం రూ.800 కోట్లకు పైగానే.
భారత్లోని పంజాబీ కుటుంబానికి చెందిన నికేష్ వార్షిక ఆదాయం రూ. 1250 కోట్లు. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. అయితే ప్రాథమిక విద్య అంతా ఇండియాలో పూర్తిచేసిన నికేష్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్ కాలేజీ నుంచి ఎంఎస్ ఫైనాన్స్ చేశాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఫాలో ఆల్టో అనే నెట్వర్క్ సంస్థను నడిపిస్తున్నాడు.
Also Read: విజయ్ దేవరకొండ తో దిగిన ఆ ఫోటోలు బయటపెట్టిన రష్మిక… మరచిపోలేని మూమెంట్స్ అంటూ
వైభవ్ తనేజా అనే మరో భారతీయుడు ప్రముఖ టెస్లా కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. ఢిల్లీకి చెందిన ఈయన రూ. 1200 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన వైభవ్ ఆ తర్వాత అమెరికా వెళ్లి టెస్లా కంపెనీలో ఉద్యోగాన్ని పొందాడు.
పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం విదేశీ కంపెనీలను ఏలుతున్నారు. ప్రముఖ హాట్ స్పాట్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థకి సీఈవో ఉన్న ఈమె ప్రస్తుతం రూ. 200 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. కోయంబత్తూరు కు చెందిన ఈమె అమెరికాలో చదివి.. ఆ తర్వాత ఈ కంపెనీకి సీఈఓ గా మారారు. ఇలా మరికొంతమంది భారతీయులు విదేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సారధిగా కొనసాగుతున్నారు.