Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (icc champions trophy 2025) తొలి సెమీఫైనల్‌లో భారత్–ఆస్ట్రేలియా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Austrelia) 264 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్‌లో టార్గెట్ ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్.రాహుల్(42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరులో హార్ధిక్ పాండ్యా(28) బ్యాట్ ఝళిపించాడు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా హార్దిక్ చేసిన 28 పరుగులు,ఆడమ్ జంపా బౌలింగ్‌లో కొట్టిన వరుస సిక్స్‌లు మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచాయి. విజయాన్ని భారత్‌వైపు తిప్పాయి.
Also Read: న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. టీమిండియాలో ఆ మ్యాజికల్ బౌలర్ ఆడేది అనుమానమే.. ఎందుకంటే?
డ్రెస్సింగ్ రూంలో టెన్షన్..!
హార్ధిక్ పాండ్యా(Hardhik Pandya) క్రీజులోకి వచ్చే సమయానికి డ్రెస్నింగ్ రూంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడి పరిస్థితుల గురించి మ్యాచ్ తర్వాత హార్దిక్, అక్షర్ పటేల్(Axar Patel) వెల్లడించారు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు టెన్షన్ చూసి నవ్వుకున్నాను. వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అనుకోలేదు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ వాతావరణం ఉంటుందని నాకు తెలుసు. అని పాండ్యా వెల్లడిచాడు.
స్ట్రైక్ రొటేట్ చేయండి..
ఇక అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. అందరి ముఖాల్లో కాస్తంత ఆందోళన నెలకొని ఉంది. హార్ధిక్, రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండాలి అన్నాడు. కానీ, నాకు హార్దిక్‌పై నమ్మకం ఉంది. ఆ సమయంలో నా చుట్టూ ఉన్నవాతావరణాన్ని ఆసక్తిగా గమనించాను’ అని తెలిపాడు.
ఒత్తిడి తగ్గింది..
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో నాపై ఒత్తిడి తగ్గింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది అని కేఎల్.రాహుల్ ఆనందం వ్యక్తం చేశాడు.
మొత్తంగా ఆసిస్‌పై గెలుపుతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 9న దుబాయ్‌లో న్యూజిలాండ్, భారత్ మద్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: న్యూజిలాండ్ జట్టును ఆడిపోసుకుంటున్నాం గానీ.. అది కూడా బాధిత జట్టే