Chanakya Niti: మౌర్య సామ్రాజ్యానికి చెందిన చాణక్యుడు రాజనీతికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే మనుషుల జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలు అందించారు.అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఈ నీతి శాస్త్రాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు . ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పినా చాణక్యుడు ఒక పురుషుడిని ఆకట్టుకోవడానికి మహిళ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుందని తెలియజేశాడు. ఈ లక్షణాలతో పురుషుడి మనసును గెలుసుకుంటుందని చాణక్యుడు చెప్పారు. మరి ఆ లక్షణాలు ఏవో తెలుసుకుందాం..
సాధారణంగా మగవారికి ధైర్యం ఎక్కువ అని వింటూ ఉంటాం. కానీ మగవారి కంటే ఆడవారిలోనే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని పూర్తి చేయడానికి వారు ఎంతటికైనా తెగిస్తారు. అయితే ఈ ధైర్యం కొందరి ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఈ లక్ష్యం ఉన్న ఆడవారు పురుషుడు కావాలని కోరుకుంటే వారి ముందు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. వారిని సొంతం చేసుకోవడానికి ధైర్యసహసాలను ప్రదర్శిస్తారు. ఇలాంటి ధైర్యం ఉన్నవారికి మగవారు ఆకర్షితులవుతారు. అయితే వీరు ఎదుటి వ్యక్తిలో కూడా ధైర్యాన్ని పరీక్షిస్తారు.
తెలివి అందరి సొత్తు కానీ కొందరిలో మాత్రమే ఈ లక్షణం తెలివి ఉండడం వల్ల వారి జీవితం సుఖసంతోషాలతో ముందుకు వెళ్తుంది. కొన్ని కష్టమైన పనులను కూడా వారు తెలివితో పరిష్కరించుకోగలుగుతారు. ఇలా తెలివి ఉన్న ఆడవారు అంటే మగవారికి చాలా ఇష్టం. ఇలాంటివారు కొందరే ఉంటారని మగవారు అనుకుంటూ ఉంటారు. అయితే తెలివి ఉన్న ఆడవారు మగవారిని ఆకర్షించుకోవడానికి కొన్ని విషయాల్లో తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. వీటికి ఆకర్షితులైన వారు వారిని కోరుకుంటారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి ఆడవారు తమ తెలివైన ప్రదర్శించడంతో వారికి ఇలా అవుతారు.
భావోద్వేగం పంచడంలో మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా తెలుసు. అయితే వారు చేసే కొన్ని పనులు హృదయాన్ని తాగుతూ ఉంటాయి. ఇలా తమ భావోద్వేగంతో మగవారిని ఆకట్టుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీరి భావోద్వేగంతో ఎదుటివారికి కన్నీళ్లు కూడా తెప్పిస్తారు. ఇలాంటి హృదయం ఉన్నవారికి మగవాళ్లు ఫిదా అయిపోతారు.
ఈ మూడు లక్షణాలు మాత్రమే కాకుండా మరికొన్ని వాటికి కూడా మగవాళ్ళు ఆడవారిని కోరుకుంటారు. కొందరి ఆడవాళ్ళలో స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. మీరు ఏ పని చేసినా న్యాయంగా పూర్తి చేస్తారు. అలాగే ఇతరులకు సాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. మాటల మాధుర్యాన్ని కొనసాగిస్తూ ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడవారిని మగవారు వెంటనే కోరుకుంటారు. అయితే వారు కూడా తమకు కావాల్సిన లక్షణాలు ఎటువంటి లో ఉంటేనే వారిని ఇష్టపడతారు. అలా కాకుండా వ్యతిరేక భావాలు ఉన్న.. లేదా ఇతర లక్షణాలను కలిగి ఉన్నా.. వారికి దూరంగా ఉంటారు. అందువల్ల పై మూడు లక్షణాలు ఉన్న వారిని కోరుకోవాలని అనుకునేవారు.. వారికి అనుగుణంగా ఉండడం వల్ల వారిని దక్కించుకునే అవకాశం ఉంటుందని చాణక్య నీతి తెలుపుతుంది.