2026 T20 World Cup Squad India: ఇండియా లో క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఒకప్పుడు టెస్ట్ వన్డేలకు మంచి డిమాండ్ ఉండేది.కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో క్రికెట్ మీద అంత సమయాన్ని కేటాయించేంత ఖాళీగా ఎవరు ఉండటం లేదు. కాబట్టి టి20 ఫార్మాట్ కి చాలా క్రేజ్ పెరిగింది. ఈ ఫార్మాట్లో చాలా ఈజీగా సిక్స్ లు కొట్టడం, ఎక్కువ పరుగులు చేయడం ప్రేక్షకులందరికి ఒక మజాను ఇస్తోంది. అందుకే ఈ పొట్టి ఫార్మాట్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది… ఇక చాలామంది టి20 మ్యాచ్ లను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడుగా ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల జనాలందరూ టి 20 ఫార్మాట్ కి ఎడిట్ అయిపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక 2007వ సంవత్సరంలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ ను ఇండియన్ టీం గెల్చుకుంది. గత సంవత్సరం జరిగిన టి20 వరల్డ్ కప్ సైతం ఇండియన్ టీం దక్కించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక 2026వ సంవత్సరంలో రాబోతున్న టి20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం ఇప్పటినుంచే కసరత్తులను చేస్తోంది.
దాని కోసం ఇండియన్ టీం చీఫ్ సెలక్టర్ ఆయన అజిత్ అగార్కర్ ఈ విషయం మీద స్పందించాడు. ముఖ్యంగా శుభమాన్ గిల్ ను టీ 20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడం పట్ల చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం మీద అజిత్ అగార్కర్ సైతం స్పందించాడు. గిల్ ను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో ఒక క్లారిటీ ఇచ్చాడు. గిల్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా కూడా అతను మ్యాచ్ మీద గొప్ప ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలడు.
అలాంటి గిల్ ను పాకాన పెట్టడానికి కారణం అతని ఫామ్ కాదు. కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం వల్లే అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందంటూ అగర్వార్ క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా టీమ్ మిడిల్ ఆర్డర్ ను స్ట్రాంగ్ చేయడానికి ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకోవాల్సి వచ్చిందని దానివల్లే గిల్ ను పక్కన పెట్టామంటూ అనే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇదే విషయం మీద సూర్య కుమార్ యాదవ్ సైతం స్పందించాడు.
గిల్ ను పక్కన పెట్టడానికి ముఖ్య కారణం కాంబినేషన్ సెట్ అవ్వకపోవడమే అంటూ ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. కొద్దిరోజుల నుంచి టీ20 లో గిల్ పెద్దగా రాణించడం లేదు.15 మ్యాచ్ లలో కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరుగులను చూసినట్టయితే గిల్ ఎంత ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడో మనకు అర్థమైపోతుంది…
ఇండియన్ టీం జట్టు
సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటిల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్పృత్ బుమ్ర, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, వాషింగ్ టన్ సుందర్, ఇషాన్ కిషన్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి…