Chennai Super Kings: ఇటీవల సీజన్లో రుతు రాజ్ గైక్వాడ్ కు ధోని తన నాయకత్వ బాధ్యతలను అప్పగించాడు.. అయితే అందరూ ఊహించినట్టుగా చెన్నై జట్టు విజేత కాలేదు. 2023లో చూపించిన ప్రతిభను ఇటీవలి సీజన్ లో చెన్నై జట్టు ప్రదర్శించలేదు. 2023లో చెన్నై జట్టు అద్భుతంగా ఆడింది. ధోని నాయకత్వంలో ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టును ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. తద్వారా ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైతో సమానంగా నిలిచింది. అయితే ఇటీవల మెగా వేలంలో చెన్నై జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవిహాత్మక లోపాల వల్ల బలమైన జట్టను నిర్మించుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై జట్టు ఐపీఎల్ ప్రారంభించి బలమైన ప్రణాళికలను రూపొందించుకుంది. పటిష్టమైన నిర్ణయాలను అమలు చేసింది. అద్భుతమైన ఆటగాళ్ల కలయికతో అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసింది. కానీ ఈసారి మెగా వేలంలో చెన్నై జట్టు తన ప్రణాళికలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. బలమైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోవడం వచ్చే సీజన్లో ఆ జట్టు విజయాలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అది రిస్క్
చెన్నై జట్టులో ధోనికి బ్యాకప్ లాంటి ఆటగాడిని భర్తీ చేయలేకపోవడం ప్రధాన లోపం. ధోని మహా అయితే ఈ సీజన్ వరకు ఆడతాడు. అతడు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. గతంలో మాదిరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇక మతిష పతీరణ లాంటి బౌలర్ ను అంటిపెట్టుకున్నప్పటికీ.. అతడికి అనుబంధంగా అదే స్థాయిలో మరో బౌలర్ ను చెన్నై జట్టు నియమించుకోలేకపోయింది. ఇది చెన్నై జట్టుకు ప్రధాన అవరోధంగా మారింది. అనుభవం ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోవడం ప్రధాన ప్రతిబంధకంగా మారింది. మెరుగైన బ్యాటర్లు లేకపోవడం, అనుభవం ఉన్న బౌలర్లను కొనుగోలు చేయలేకపోవడం చెన్నై జట్టుకు కష్టాలను తెచ్చిపెడుతుందని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ” చెన్నై జట్టు అత్యంత బలమైనది. ఐపీఎల్ లో ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా అవతరించింది. బలమైన ఆటగాళ్లు ఉన్న ఆ జట్టు ఇప్పుడు అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. చురకత్తులలాంటి ఆటగాళ్లను భర్తీ చేసుకోలేకపోవడం ఆ జట్టు యాజమాన్యం చేసిన ప్రధాన తప్పిదం. ఐపీఎల్ ఆంటేనే వేగానికి కొలమానం లాగా ఉంటుంది. ఆటగాళ్లు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. అలాంటి శక్తి యుక్తులు లేనప్పుడు చెన్నై జట్టు ఇబ్బంది పడక తప్పదని” క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసి ఉంటే చెన్నై జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేదని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటే వారు సరిగ్గా రాణించలేరని వివరిస్తున్నారు.