https://oktelugu.com/

ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..!

జార్ఖండ్ డైనమైట్.. మిస్టర్ కూల్.. ది ఫినిషర్.. ఇలా మహేంద్ర సింగ్ ధోని చాలా పేర్లు ఉన్నాయి. తోటి క్రికెటర్లంతా అతడిని మహీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ధోని ఆటను చూసేందుకు వేలాదిమంది అభిమానులు స్టేడియంలలో.. కోట్లాదిమంది టీవీల్లో ఉత్సాహం చూపుతుంటారు. Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా? కెరీర్ తొలినాళ్లలో మహేంద్ర సింగ్ వికెట్ కీపర్ గా.. బ్యాట్స్ మెన్ గా రాణించారు. ఆ తర్వాత జట్టు బాధ్యతలు తీసుకొని బెస్ట్ కెప్టెన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 11:06 AM IST
    Follow us on

    జార్ఖండ్ డైనమైట్.. మిస్టర్ కూల్.. ది ఫినిషర్.. ఇలా మహేంద్ర సింగ్ ధోని చాలా పేర్లు ఉన్నాయి. తోటి క్రికెటర్లంతా అతడిని మహీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ధోని ఆటను చూసేందుకు వేలాదిమంది అభిమానులు స్టేడియంలలో.. కోట్లాదిమంది టీవీల్లో ఉత్సాహం చూపుతుంటారు.

    Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?

    కెరీర్ తొలినాళ్లలో మహేంద్ర సింగ్ వికెట్ కీపర్ గా.. బ్యాట్స్ మెన్ గా రాణించారు. ఆ తర్వాత జట్టు బాధ్యతలు తీసుకొని బెస్ట్ కెప్టెన్ అనిపించారు. టీంఇండియాకు ట్వీ-20 వరల్డ్ కప్.. వన్డే ప్రపంచ కప్.. ఐసీసీ ట్రోఫీలు అందించారు. ధోని హయాంలోనే భారత్ ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది.

    అయితే గత కొంతకాలంగా ధోని పరుగులు చేస్తున్నప్పటికీ మ్యాచులను గెలిపించలేకపోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ధోని మునుపటిలా ఆడడం లేదని అభిప్రాయం ఫ్యాన్స్ లోనూ వ్యక్తం అవుతోంది. ధోని క్రీజులో ఉన్నప్పటికీ ప్రత్యర్థి జట్లు ఇటీవలే కాలంలో విజయాలు సాధించడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

    బెస్ట్ ఫినిషన్ గా పేరు తెచ్చుకున్న ధోని కొంతకాలంగా ఆమేరకు ఆడటం లేదనే మాజీ విమర్శిస్తున్నారు. ఐపీఎల్-2020లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న ధోని పెద్దగా ఆకట్టుకోవడం లేదనిపిస్తోంది. తొలి మ్యాచులో ధోని రాణించినట్లు కన్పించినా ఆ తర్వాత మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించలేకపోతున్నాడు.

    Also Read: ఐపీఎల్-2020: కఠిన ‘బుడగ’ నిబంధన.. లేదంటే వేటే?

    చివరి ఓవర్లో ధోని ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి ఉండేది. పరుగుల లక్ష్యం ఎంత పెద్దగా ఉన్నా ధోని చివరి ఓవర్లలో ఫోర్లు.. సిక్సర్లతో రెచ్చిపోయి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్లో అతడి ఆటతీరు చూస్తుంటే ధోనిలో బెస్ట్ ఫినిషర్ లేడనే టాక్ విన్పిస్తోంది. ధోని తదుపరి మ్యాచుల్లోనైనా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతాడో లేదో వేచిచూడాల్సిందే..!