https://oktelugu.com/

‘మెసగాళ్లు’ టీజర్ టాక్: ఇది సరిపోతుందిగా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. మంచు విష్ణు గత సినిమాలన్నీ కూడా ఆయనకు స్టార్డమ్ ను తీసుకురాలేకపోయాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మంచు విష్ణు స్టార్ గా ఎదగలేకపోతున్నాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ‘మెసగాళ్లు’ మూవీతో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల మంచు విష్ణు పుట్టిన రోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 11:09 AM IST
    Follow us on


    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. మంచు విష్ణు గత సినిమాలన్నీ కూడా ఆయనకు స్టార్డమ్ ను తీసుకురాలేకపోయాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మంచు విష్ణు స్టార్ గా ఎదగలేకపోతున్నాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ‘మెసగాళ్లు’ మూవీతో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’

    ఇటీవల మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘మోసగాళ్లు’ మూవీ ఫస్టు లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ‘మోసగాళ్లు’ టీజర్ ను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.మోసగాళ్లు చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండగా జేఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. 31సెకన్ల నిడివితో రిలీజైన మోసగాళ్ల టీజర్ ఆద్యంతం అలరించింది. యాక్షన్.. సస్సెన్స్ థ్రిలర్ లా ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా మంచు విష్ణుకు మంచి విజయం అందించేలా కన్పిస్తోంది.

    టీజర్ ఓపెనింగులోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఎంట్రీ ఇస్తాడు. ట్రంప్ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి.. ‘వియ్ విల్ ఫైండ్ యు.. వియ్ విల్ ఎలిమినేట్ యు.. ఐ యామ్ ప్రపేర్డ్ టేక్ యాక్షన్ వాటెవ్వర్ నెసెస్సరీ.. అంటూ హంగామా చేస్తూ కన్పించాడు.. ఇంతలోనే మంచు విష్ణు-కాజల్ జోడీ ఎంట్రీ ఇస్తారు. వెంటనే ప్రత్యక్షమైన డబ్బు సంచులు దాచిన డెన్ నుంచి బయటికి స్టైల్ గా నడుచుకుంటూ వస్తుండటం చూపించారు.. ఇది సరిపోతుందా.. అంటూ కాజల్ ప్రశ్న.. దానికి సమాధానంగా.. ఆట ఇప్పుడే మొదలైంది.. అంటూ మంచు విష్ణు అంటాడు.

    Also Read: మున్ముందు ఓటీటీ సినిమాలంటే భయపడాలేమో..

    ఇక ఈ సినిమా విషయానికొస్తే అమెరికాలో పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో సాగనుంది. మెసగాళ్లుగా విష్ణు-కాజల్ జోడీ కన్పిస్తుందా? లేదా వీరే మోసగాళ్ల ఆటకట్టిస్తారా? అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో కన్పించబోతున్నారు. రుహి సింగ్.. నవీన్ చంద్ర.. నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో కన్పించబోతున్నారు. ‘మెసగాళ్లు’ మూవీ విష్ణు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!