Virender Sehwag: టెండూల్కర్ ను అందుకే భుజాలపైకి ఎత్తుకోలేదట

టీమిండియా 12 ఏళ్ల కిందట వన్డే వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేసింది. తాను జట్టులో ఉండగానే ఒక్కసారైనా వరల్డ్ కప్పును సాధించి దేశానికి అందించాలన్న చిరకాల వాంఛతో కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.

Written By: BS, Updated On : June 29, 2023 9:42 am

Virender Sehwag

Follow us on

Virender Sehwag: 2011 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత జట్టు ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు ఫైనల్ లో విజయం తర్వాత ఎగిరి గంతులేశారు. సుదీర్ఘ క్రికెట్ కెరియర్ ఆడిన సచిన్ టెండూల్కర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ విజయం తరువాత ఆటగాళ్లు చేసిన ఒక పని అందరికీ ఇప్పటికే గుర్తుండే ఉంటుంది. అదే లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భుజాలపై ఎత్తుకొని స్టేడియం మొత్తం ఆటగాళ్లు తిప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే సచిన్ టెండూల్కర్ భుజాలపై ఎత్తుకున్న వారిలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, సురేష్ రైనాతోపాటు మిగిలిన ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ తమ భుజాల మీద ఎత్తుకొని స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదాలు చేశారు. అయితే, సచిన్ టెండుల్కర్ ను ఎత్తుకునేందుకు ధోని, వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు రాలేదు. దీనిపై అప్పట్లోనే చర్చ జరగగా, తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ నాటి ఘటనపై స్పందించాడు.

టీమిండియా 12 ఏళ్ల కిందట వన్డే వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేసింది. తాను జట్టులో ఉండగానే ఒక్కసారైనా వరల్డ్ కప్పును సాధించి దేశానికి అందించాలన్న చిరకాల వాంఛతో కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 2011లో జరిగిన వరల్డ్ కప్ తో సచిన్ టెండుల్కర్ తన కెరీర్ ను ముగించాలని భావించి బరిలోకి దిగాడు. సచిన్ టెండుల్కర్ కు వరల్డ్ కప్ విజయాన్ని అందించి సగర్వంగా రిటైర్మెంట్ తీసుకునేలా చేయాలన్న ఉద్దేశంతో ఆటగాళ్లు కూడా మంచి పట్టుదలతో ఆడారు. అందుకు అనుగుణంగానే అద్భుతమైన విజయాలను నమోదు చేసి భారత గట్టు వరల్డ్ కప్ గెలిచేలా చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ తో పాటు ఇతర ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం మొత్తం తిప్పి అభిమానులకు సగర్వంగా అభివాదాలు చేశారు. అయితే సచిన్ టెండూల్కర్ భుజాలపై ఎత్తుకునేందుకు ఆసక్తి చూపించలేదు ధోని, వీరేంద్ర సెహ్వాగ్. దీనికి గల కారణాలను తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ బయట పెట్టాడు.

భుజాలు గాయాలతోనే దూరంగా ఉన్నామంటూ వెల్లడి..

నాటి ఘటనపై తాజాగా ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు విషయాన్నీ బయట పెట్టాడు లెజెండ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. సచిన్ టెండుల్కర్ చాలా బరువుగా ఉంటాడని, మేం ఎత్తుకునే పరిస్థితుల్లో లేమని సెహ్వాగ్ వెల్లడించాడు. మా వయసు ఎక్కువ అని, భుజాలకు గాయాలు ఉండడం వల్ల తాను సచిన్ టెండూల్కర్ ఎత్తుకోలేకపోయానని, ధోనీకి మోకాలి నొప్పి వల్ల అతను వెళ్లలేకపోయాడని సెహ్వాగ్ వివరించాడు. మిగిలిన ఆటగాళ్లకు ఇతర సమస్యలు ఉండడం వల్ల సచిన్ టెండూల్కర్ ఎత్తుకోలేకపోయారని స్పష్టం చేశాడు. అందుకే ఆ పనిని కుర్రాళ్లకు అప్పగించామని, సచిన్ ను ఎత్తుకొని స్టేడియం మొత్తం తిప్పమని చెప్పామని, అందుకే కోహ్లీ ఎత్తుకున్నాడని సెహ్వాగ్ నాడు జరిగిన విషయాన్ని అందరితో పంచుకున్నాడు.