Virender Sehwag : ఐపీఎల్ లో ప్రతి ఏడాది సంచలనాల మీద సంచలనాలు నమోదవుతూనే ఉంటాయి. కొంతమంది ఆటగాళ్లు భారీ అంచనాల మధ్య మైదానంలోకి వస్తారు. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటారు. ఇక మరి కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తారు. బంతులతో మాయాజాలం చేస్తారు. మొత్తంగా తమకంటూ ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక పేజీలను రాసుకుంటారు. సరికొత్త అధ్యాయాలను సృష్టిస్తారు. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారీ అంచనాల మధ్య మైదానంలోకి వస్తారు. కాకపోతే వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమవుతుంటారు. నమ్ముకున్న జట్టును.. ఇష్టాన్ని చూపించే అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తారు. అంతేకాదు ఆటగాళ్లు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ తమ ఆట తీరు మాత్రం మార్చుకోరు.
Also Read : టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పుత్రోత్సాహం.. ఇంతకీ అతని కుమారుడు ఏం చేశాడంటే?
దారుణాతీదారుణం
ప్రస్తుతం ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంటున్నది. జట్ల యాజమాన్యాల నుంచి కోట్లకు కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లు.. ఆటతీరులో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. ఈ జాబితాలో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న మాక్స్ వెల్, బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న లివింగ్ స్టోన్ ముందువరుసలో ఉంటారు. వాస్తవానికి వీరిద్దరికి భీకరమైన ఆటగాళ్లు అనే పేరు ఉంది. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తారనే క్రికెట్ వర్గాల్లో ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అందువల్లే వీరిని భారీ ధరకు ఆయా జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. కానీ ఆటతీరులో మాత్రం మీరు అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు..” వారిలో శ్రద్ధ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు. జట్టు కోసం ఆడాలి అనే తపన కనిపించడం లేదు. తమ కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన జట్ల కోసం ఆడాలి అనే తాపత్రయం ఏ కోశాన లేదు.. ఇద్దరు ఆటగాళ్లు కేవలం భారత్లో హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. నేను చాలామంది విదేశీ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధిక శాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు.. వారికి ఆడాలనే కసి ఉండదు. పోరాడాలి అనే తాపత్రయం ఉండదు. ఏదో కొనుక్కున్నారు. రమ్మన్నారు.. వచ్చాం అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉంటుంది. అలాంటి వారి వల్ల ఐపిఎల్ పరువు పోతుంది. ఇలాంటి ఆటగాళ్లు ఆడకపోవడమే మంచిది. ఐపీఎల్ లో తన పేర్లను నమోదు చేసుకోకుండా ఉంటే బాగుంటుందని” వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి. అన్నట్టు వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల కాలంలో ఓవర్సీస్ ఆటగాళ్లపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు కాకపోతే ఈసారి మాత్రం తన స్వరాన్ని మరింత పెంచి సెహ్వాగ్ విమర్శలు చేశాడు.
Also Read : భారత స్పిన్ బౌలింగ్ లో పస తగ్గింది అందువల్లే.. వీరేంద్ర సెహ్వాగ్