Virat : విరాట్ కోహ్లీ టెస్టులకు దూరమైనప్పటికీ అతని సంపాదన మాత్రం తగ్గలేదు. పైగా అతడేకంగా 1000 కోట్ల క్లబ్లో చేరాడు. అంతకుమించి అనే విధంగా సంపాదనతో అదరగొడుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెటర్ గా ఎదిగాడు. 2015లో విరాట్ ఆస్తుల విలువ 150 కోట్లు ఉండగా.. 2018లో అది 500కు చేరుకొద్దీ.. 2024లో 1000 కోట్లకు.. 2025లో 1050 కోట్లకు చేరుకుంది.. బిసిసిఐ ఇచ్చిన ఏ ప్లస్ ప్లేయర్ కేటగిరి ద్వారా విరాట్ కోహ్లీకి 7 కోట్లు వార్షిక వేతనం గా లభిస్తుంది. ఐపీఎల్ లో బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ ఇద్దరికీ 15 కోట్లు చెల్లిస్తుంది. ఇక వన్డే ఫార్మాట్లో ప్రతి మ్యాచ్ కు విరాట్ కోహ్లీ ఆరు లక్షలు స్వీకరిస్తాడు. టెస్ట్ ఫార్మాట్ అయితే 15 లక్షలు.. టి20 అయితే మూడు లక్షలు వసూలు చేస్తాడు.. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఏడు నుంచి పది కోట్ల వరకు వసూలు చేస్తాడు. ప్రకటనల ద్వారా విరాట్ కోహ్లీకి ప్రతి ఏడాది 200 కోట్లు దాకా ఆదాయం వస్తుంది. ప్యూమా, ఆడి, ఎంఆర్ఎఫ్, మింత్రా, బ్లూ ట్రైబ్, ఇతర సంస్థలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. కేవలం ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే కాకుండా.. ఎంటర్ ప్రెన్యూరర్ గా విరాట్ కోహ్లీ అనేక సంస్థలను నెలకొల్పాడు.. రాగన్ పేరుతో దుస్తులను.. వన్ 8 కమ్యూన్ బార్ అండ్ రెస్ట్రో పేరుతో హోటల్ బిజినెస్ చేస్తున్నా. చిసెల్ పేరుతో జిమ్ లు నిర్వహిస్తున్నాడు..ఎస్ సీ గోవా పేరుతో ఐసిఎల్ లో ఫుట్బాల్ టీం కొనుగోలు చేశాడు. అనేక స్టార్ట్ అప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు.
Also Read : విరాట్ కోహ్లీకి అదిరిపోయే రేంజ్ లో ఫేర్వెల్.. గట్టి ప్లాన్ చేసిన ఆర్సిబి
కోట్లకు కోట్లు..
వ్యాపారం, ప్రకటనలు మాత్రమే కాదు.. స్థిర ఆస్తులలో కూడా విరాట్ కోహ్లీ తనదైన రికార్డు సృష్టించాడు. ఇతడికి ముంబైలో 34 కోట్ల విలువైన ఫ్లాట్ ఉంది. గుర్గాం ప్రాంతంలో 80 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అంతేకాకుండా 2.9 కోట్ల విలువచేసే ఆడి కారు, 2.26 కోట్ల విలువచేసే రేంజ్ రోవర్.. ఇవి మాత్రమే కాకుండా బెంట్లీ, మెర్సిడెస్ వంటి కార్లు ఉన్నాయి.. కోహ్లీ అనుష్క శర్మ 2017లో వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. అనుష్క శర్మ ఆస్తుల విలువ 255 కోట్ల వరకు ఉంటుంది. వీరిద్దరూ కలిసి దాదాపు 1300+ కోట్లకు తమ ఆస్తులను పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబం లండన్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కాలంలో విరాట్ కోహ్లీ లండన్ లోనే స్థిరపడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అతడు అక్కడ అన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : 53 నిమిషాల్లో 53 లక్షల లైక్స్.. అక్కడ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ