Virat Kohli : ఇక తాజాగా బెంగళూరు జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో తలపడుతోంది. ఇందులో భాగంగా ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 22 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాల్ట్ (37) దుమ్ము రేపడంతో బెంగళూరు జట్టు 3.5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది. సాల్ట్ దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. లేకుంటే బెంగళూరు స్కోరు మరింత వేగంతో వెళ్ళేది.. అయితే ఈ మ్యాచ్లో ఓపెనర్లు అందించిన మెరుపు ఆరంభాన్ని బెంగళూరు జట్టు మిగతా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేదు. దీంతో అతి భారీ స్కోర్ చేయాల్సిన చోట.. 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read : మహాత్మా గాంధీ.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ.. ఇంతకీ ఈ పోలిక ఎందుకంటే?
విరాట్ అరుదైన ఘనత
ఈ మ్యాచ్లో 22 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఐపిఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. బహుశా ఈ రికార్డును మరే ఆటగాడు కూడా బద్దల కొట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు బౌండరీలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాలలో ధావన్ (920), డేవిడ్ వార్నర్ (899), రోహిత్ శర్మ (885), గేల్(761) ఉన్నారు.. ఇక విరాట్ ఈ మ్యాచ్లో 22 పరుగులు చేశాడు.. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత.. బెంగళూరు జట్టు ఒక్కసారిగా తడబడింది. అక్షర్ పటేల్ తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించడంతో బెంగళూరు జట్టు కకావికలం అయిపోయింది. ముఖ్యంగా విప్రజ్ నిగం, కులదీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ చెరొక వికెట్ సాధించారు.