MS Dhoni : ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో పుట్టినప్పటికీ.. చెన్నై జట్టుకు కెప్టెన్ కావడం వల్ల.. ధోని తన ప్రాణం పెట్టి ఆడాడు. ఆటగాళ్లలో స్ఫూర్తినింపాడు. టీమిండియా కు ఎలాగైతే విజయాలు అందించాడో.. చెన్నై జట్టుకు కూడా అనితర సాధ్యమైన గెలుపులను దక్కేలా చేశాడు. మామూలు ఆటగాళ్లను కూడా స్టార్ ప్లేయర్లుగా మలిచాడు. అదిగో అందువల్లే చెన్నై జట్టు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన టీం గా పేరు తెచ్చుకుంది. బలమైన ముంబై ఇండియన్స్ జట్టు సరసన నిలబడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను సగర్వంగా ఎత్తి చూపింది. అందువల్లే చెన్నై జట్టుకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. మహేంద్ర సింగ్ ధోనిని అభిమానంగా తలా అని పిలుచుకుంటారు. ధోని చెన్నై జట్టు కెప్టెన్ అయిన తర్వాత అతడి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఏకంగా అతను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమా కూడా నిర్మించాడు అంటే. చెన్నై అంటే ధోనికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఐపీఎల్ లో ఒకే ఒక్కడిగా విరాట్ కోహ్లీ.. ఆ రికార్డు ఎవరికీ సాధ్యం కాదు
ఓ రేంజ్ లో ఎలివేషన్
ధోని 2023 సీజన్ వరకు చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సీజన్లో చెన్నై జట్టును అతడు విజేతగా నిలిపాడు. ఇక 2024 సీజన్ నుంచి ధోని చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. గడిచిన సీజన్లో చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించడం మొదలుపెట్టాడు. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు అభిమానులు అంచనా వేసిన విధంగా విజయాలు సాధించలేకపోయింది. ఇక ఈ సీజన్ లోనూ చెన్నై జట్టు గొప్పగా రాణించలేకపోతోంది. పాయింట్లు పట్టిక లో 9వ స్థానంలో ఉంది. ఇక ఇదే తరుణంలో చెన్నై చెట్టు కెప్టెన్ గైక్వాడ్ గాయపడ్డాడు. అతడు తదుపరి మ్యాచ్ లకు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోల్పోయాడు. దీంతో చెన్నై యాజమాన్యం ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా ధోని రేపు జరిగే మ్యాచ్లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో విక్రమ్ సినిమా లోని పోరాట సింహం అనే పాటను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా ఉపయోగించింది. ధోని స్టేడియంలోకి నడిచి వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చెన్నై జట్టు యాజమాన్యం ప్రముఖంగా చూపించింది. ధోని ఆధ్వర్యంలో చెన్నై జట్టు సాధించిన విజయాలకు గుర్తుగా.. ఆ సంవత్సరాలను చెన్నై స్టేడియంలో కనిపించే విధంగా చేసింది. మొత్తంగా ఈ వీడియో రోమాలు నిక్క పొడిచే విధంగా ఉంది. ధోనిని అఫీషియల్ గా కెప్టెన్ గా నియమించిన నేపథ్యంలో అభిమానులకు హై వోల్టేజ్ కిక్ ఎక్కించే విధంగా చెన్నై యాజమాన్యం ఇలాంటి వీడియోను రూపొందించిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
CSK EDIT FOR CAPTAIN MS DHONI pic.twitter.com/Pv6CPdYece
— Johns. (@CricCrazyJohns) April 10, 2025