Allu Arjun-Atlee : అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అట్లీ(Atlee) తో చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి ఒక సెన్సేషనల్ వీడియో ని విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. అసలు ఇది మన తెలుగు సినిమానేనా?, ఏమి తియ్యబోతున్నారు అనే ఫీలింగ్ ని రప్పించారు. కేవలం ప్రకటన వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇన్ని రోజులు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ, కమర్షియల్ సినిమాతోనే ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు మొట్టమొదటిసారి జానర్ ని మార్చి సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరక్కబోయే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.
Also Read : ఎన్టీఆర్ తో హాలీవుడ్ ప్రొడ్యూసర్స్.. ఏంటి కథ…
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ 165 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. అదే విధంగా డైరెక్టర్ అట్లీ దాదాపుగా 125 కోట్లు తీసుకుంటున్నాడు. కేవలం వీళ్లిద్దరి రెమ్యూనరేషన్స్ 290 కోట్ల రూపాయిలు ఉంది. ఇక సినిమా బడ్జెట్ మొత్తం కలిపి దాదాపుగా 800 కోట్ల రూపాయలకు పైగానే అవుతుతోందని అంటున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ఇదే రేంజ్ బడ్జెట్. వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్, అట్లీ మూవీ కి కూడా ముందుగా అనుకున్న బడ్జెట్ 800 కోట్లు. అది భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. అట్లీ ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో మూడు సినిమాలు చేసాడు, అదే విధంగా షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా.
అన్నీ కమర్షియల్ సినిమాలే, వేటికి కూడా భారీ బడ్జెట్ అవసరం లేకుండా ఉన్నింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 800 కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాని అట్లీ సమర్థవతంగా తీయగలడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు అట్లీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది అట్లీ డ్రీం ప్రాజెక్ట్ అట. ముందుగా సల్మాన్ ఖాన్ తో చెయ్యాలని అనుకున్నారు కానీ, ఆయన పై అంత బడ్జెట్ పెట్టలేమని, కేవలం నార్త్ ఇండియా కి మాత్రమే ఆయన పరిమితమని, సౌత్ మార్కెట్స్ లో పెద్దగా ఉండదని, అదే అల్లు అర్జున్ తో చేస్తే సౌత్ తో పాటు నార్త్ ఇండియా కూడా కవర్ అవుతుందని బలంగా నమ్మి సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయాలనీ ఫిక్స్ అయ్యారట.
Also Read : లక్షలు దోచేశారు..హీరో హృతిక్ రోషన్ పై ఫ్యాన్స్ ఫైర్!