Virat Kohli: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. తొలి టెస్టు మినహా మిగతా మూడు టెస్టుల్లో భారత బ్యాట్స్ మెన్‌లు విఫలమయ్యారు. బైలర్లు రాణిస్తున్నా. బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేస్తున్నారు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లుగా గుర్తింపు ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా విఫలం అవుతున్నారు. కెప్టెన్ రోహిత్ అయితే ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రెండంకెల స్కోర్ చేయలేదు. కోహ్లి రెండో టెస్టులో సెంచరీ చేశాడు. కానీ, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నాడు. తాజాగా ఐదో టెస్టుల రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలం అయ్యాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. 12 బంతులు ఆడి ఒక ఫోర్ కొట్టి.. కేవలం 6 పరుగులకే పెవిలియన్ బాబట పట్టాడు. మరోసారి ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంబ్ డెలివరీకి చిక్కాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్ ఆడాడు. 8 సార్లు ఔట్ అయ్యాడు. ఒకసారి అజేయ శతకం చేశాడు. ఇక 8సార్లు ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ డెలివరికే ఔట్ కావడం గమనార్హం. తాజాగా ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్కాట్ బోలాండ్ వేసిన 14వ ఓవర్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్ల్ కూడా కోహ్లీ బోలాండ్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించినా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేదు. ఔట్ అయిన తర్వాత గట్టిగా అరుస్తూ తనపై తానే అసంతృప్తి వ్యక్తం చేశా4డు. ఆయన భార్య అనుష్క శర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లి ఔట్ అయిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెర్త్‌లో సెంచరీ..
ఈ సిరీస్‌లో కోహ్లి పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్ కూడా మెరుగైన ఆట ప్రదర్వించలేదు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలు అతన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక పింక్ బాల్ టెస్టులో అయితే మరీ ఘోరంగా రెండు ఇన్నింగ్స్‌లో 7, 11 పరుగులకే ఔఐట్ అయ్యాడు. బ్రిస్‌బేన్ టెస్టులో 3 పరుగులకే ఔట్ అయ్యాడు. మెల్‌బోర్ట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేశాడు. అయినా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతికే ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులే చేసి అదే బంతికి దొరికిపోయాడు. తాజాగా సిన్ని టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 17, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులకు ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.
The Scott Boland show is delivering at the SCG!
He’s got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j
— cricket.com.au (@cricketcomau) January 4, 2025