https://oktelugu.com/

Game changer : అభిమానులకు ఏకంగా 1 లక్ష పాసులు..1600 మంది పోలీసులు..కనీవినీ ఎరుగని రీతిలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 02:22 PM IST

    Game changer

    Follow us on

    Game changer : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మేనియా నే కనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాకముందే 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేసింది అన్నమాట. మొదటి రోజు ఈ చిత్రానికి కచ్చితంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ అయితే వస్తుంది. కానీ ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందా లేదా అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో రాజమండ్రిలో గ్రాండ్ గా జరగబోతుంది.

    ఈ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించాడు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతుండడంతో ఈ ఈవెంట్ కి లక్షకు పైగా పాసులు అభిమానులకు అందాయని తెలుస్తుంది. దీంతో పోలీస్ సెక్యూరిటీ కూడా భారీ గా ఏర్పాటు చేస్తున్నారట. 400 మంది పోలీస్ అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే సభా ప్రాంగణం కి చేరుకున్నట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటనని పరిగణలోకి తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. పైగా ఉప ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో ఏవైనా జరగరానివి జరిగితే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. అందుకే సెక్యూరిటీ విషయం లో ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈవెంట్ కి కేవలం పాసులు తీసుకున్న వాళ్ళను మాత్రమే లోపలకు అనుమతిస్తారట.

    పాసులు లేని వాళ్లకు ఎలాంటి అనుమతి లేదు. అనుమతి ఉన్నా లేకపోయినా పాసులు లేని అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి పోలీసులు వాళ్ళను ఎలా కంట్రోల్ చేస్తారు అనేది చూడాలి. అంతే కాకుండా ఈ ఈవెంట్ జరిగే గ్రౌండ్ కి సమీపంలో వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా ఏర్పడే అవకాశాలు ఉన్నందున మరో రూట్ కి దారిని మళ్లించారు. మూవీ టీం తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కి మరో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, అభిమానులకు ఇది ఒక సర్ప్రైజ్ గా ఉండబోతుందని అంటున్నారు.