Virat Kohli: వన్డేలలో, టెస్టులలో, టి20 లలో, ఐపీఎల్ లో.. ఇలా ఎలాంటి ఫార్మాట్ తీసుకున్నా విరాట్ కోహ్లీ ఏకపక్ష ప్రదర్శన కనిపిస్తుంది. ఇప్పుడంటే అతడు ఫామ్ లో లేడు గాని.. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించాడు. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటిదాకా ఫామ్ లో లేని అతడు.. ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. సిక్సర్లు, ఫోర్ ల వర్షం కురిపించాడు. అతని బ్యాటింగ్ దాటికి టీమ్ ఇండియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అంతేకాదు విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ వల్ల టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని.. దాదాపు 17 సంవత్సరాల విరామం తర్వాత టి20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది. మెల్ బోర్న్ లో 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. ఓడిపోయే మ్యాచ్లో గెలిచి చూపించాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో దూకుడు అధికంగా ఉంటుంది కాబట్టి.. అతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అతడిని సామాజిక మాధ్యమాలలో విపరీతంగా అనుసరిస్తుంటారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా ఫిదా అయ్యాడు
ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆంతోని ఆల్బనీస్ కొనసాగుతున్నారు. ఈయన అక్కడి లేబర్ పార్టీకి చెందిన నాయకుడు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. ఇందులో భాగంగా టీమిండియా ఆటగాళ్లు గురువారం ఆస్ట్రేలియా ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టీమిండియా క్రీడాకారులకు ఆయన తేనేటి విందులు ఇచ్చారు. ఆ తర్వాత ఫోటో సెషన్ జరిగింది. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆటగాళ్లు మొత్తం కలిసి ఆల్బనీస్ తో ఫోటోలు దిగారు. ఇలా ఫోటోలు దిగుతున్న క్రమంలోనే ఆల్బనీస్ విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా గుర్తించి.. ఆయనతోపాటు ఫోటోలు దిగాలని బలవంత పెట్టారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి..” విరాట్ అంటే ఒక సమ్మోహన రూపం. అతడు ఎలాంటి వారినైనా ఆకట్టుకుంటాడు. అందువల్లే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా ముచ్చటపడి విరాట్ తో ఫోటో దిగాడు. బహుశా విరాటపర్వాన్ని అనేకసార్లు చూసి ఉంటాడు కాబోలు” అని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, విరాట్ తో కలిసి దిగిన ఫోటోలను ఆస్ట్రేలియా ప్రధాని తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేయడం నెట్టింట సంచలనంగా మారింది.
Australian PM is a big Virat Kohli fan.
– The face of World Cricket! pic.twitter.com/owDXgVIHoF
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 2, 2025