Rohit Sharma – Virat Kohli : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ టీమ్ మీద ఆడిన మ్యాచ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ టోర్నీ లో వరుస విజయాలను అందుకున్న ఇండియన్ టీమ్ తనదైన రీతిలో వరల్డ్ కప్ లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక వరుసగా 6 విజయాలను అందుకున్న ఇండియన్ టీమ్ ఆల్మోస్ట్ సెమీఫైనల్ కి క్వాలిఫై అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మని ఇండియన్ టీం లో కీలక ప్లేయర్ గా మంచి గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ వచ్చి కౌగిలించుకోవడం జరిగింది.
ఇక ఈ పిక్ ప్రస్తుతం పిక్ అప్ ది డే గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా చాలా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం కూడా వైరల్ అయింది. దానికి తగ్గట్టుగానే ఇద్దరు సరిగా మాట్లాడుకోవడం లేదనే విషయం కూడా బయటకి వచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని చాలామంది చాలా రకాల కామెంట్ చేశారు అయినప్పటికీ ఎలాంటి గొడవలు లేవని ప్రస్తుతం ఇండియన్ టీం కోసం చాలా కష్టపడుతున్నారని అలాగే ఈసారి ఇండియాకి వరల్డ్ కప్ సాధించి పెట్టాలనే ఉద్దేశ్యం తో వాళ్లిద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగం గానే ఇంగ్లాండ్ టీమ్ మీద మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కోహ్లీ వచ్చి రోహిత్ శర్మతో తన హ్యాపీనెస్ పంచుకున్నట్టుగా తెలుస్తుంది.ఇది బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్స్ టేబుల్ లో ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది.ఇక 20 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ లో మరోసారి ఇంగ్లాండ్ టీమ్ ని ఓడించింది.
ఇక దీంతో మరోసారి ఈ వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ను ఓడించే టీం ఏది లేదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక ప్రస్తుతం ఉన్న టాప్ టీమ్ ల్లో ఒక్క సౌతాఫ్రికా టీమ్ మాత్రమే ఇండియాతో మ్యాచ్ ఆడలేదు.ఆ టీమ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ ఇండియా తో మ్యాచ్ ఆడితే తెలుస్తుంది అసలు సౌతాఫ్రికా టీం మెయిన్ బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది…
ఇక ప్రస్తుతం అయితే ఇండియన్ టీం ని ఓడించే టీం వరల్డ్ కప్ లో లేదనే ప్రపంచం లో ఉన్న మాజీ క్రికెటర్లు అందరూకూడా చెప్తున్నారు.ఇక ఇప్పటికే అన్ని దేశాలు కూడా ఈసారి ప్రపంచ కప్ గెలిచేది ఇండియన్ టీం అని ఇప్పటికే చాలా మంది జోష్యం చెబుతున్నారు… ఇక ఇంగ్లాండ్ మీద మ్యాచ్ లో 87 పరుగులు చేసి కీలకమైన సమయం లో టీంకు భారీ స్కోరు అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని అవార్డ్ అందించడం జరిగింది…
A very good morning to Indian Cricket fans. Last night was special for many reasons. One of the special moments is here. #INDvsENG #IndiaVsEngland#INDvENG #RohitSharma #ViratKohli pic.twitter.com/ktCCZmjyHQ
— Gems of Ads (@GemsofAdverts) October 30, 2023