https://oktelugu.com/

Varun – Lavanya Wedding : ఇటలీ దేశంలో ఖుషీ ఖుషీగా మెగా ఫ్యామిలీ, క్లిన్ కారను చూశారా… వైరల్ అవుతున్న ఫోటోలు!

నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇటలీ దేశానికి వెళ్లారు

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2023 / 09:31 AM IST
    Follow us on

    Varun – Lavanya Wedding : మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ దేశం చేరుకున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో అక్కడకు చెక్కేశారు. అందమైన దేశంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న వీరికి హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు.

    నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇటలీ దేశానికి వెళ్లారు. వీరితో ఉపాసన కొణిదెల ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. మెగా వారసురాలు క్లిన్ కారను కూడా తీసుకెళ్లారు. రామ్ చరణ్-ఉపాసన కుటుంబ సభ్యులు కలిసి దిగిన గ్రూప్ ఫొటోలో క్లిన్ కారను కూడా మనం చూడొచ్చు.

    అయితే క్లిన్ కార ముఖం దాచేస్తూ చిన్న ఎమోజీ అడ్డుగా పెట్టారు. క్లిన్ కార ముఖం ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కనిపిస్తుంది. కానీ క్లిన్ కారను స్పష్టంగా చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరలేదు. మరో నాలుగు రోజులు మెగా ఫ్యామిలీ ఇటలీలో జరిగే పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నారు. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. లావణ్య-వరుణ్ ల రిసెప్షన్ కి రాజకీయ, చిత్ర ప్రముఖులకు ఆహ్వానం ఉంటుందట.

    మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ ఇచ్చి ఆయన ఇటలీ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఫుల్ బిజీ. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్టతో ఓ మూవీ లాంచ్ చేశారు. త్వరలో అదే సెట్స్ పైకి వెళ్లనుంది.