iQOO 15R: ప్రముఖ కంపెనీ iQOO నుంచి లేటెస్ట్ గా 15 R మొబైల్ గత నెలలో లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ గురించి తెలిసిన వాళ్ళు ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి ఐక్యూ గుడ్ న్యూస్ తెలిపింది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12:00 నుంచి ఈ ఫోన్ పొందడానికి మార్గం ఏర్పడింది. ఇప్పటికే ఈ ఫోన్ గురించి తీవ్రంగా చర్చ సాగింది. 1.5 కే డిస్ప్లేతో ఉన్న ఈ మొబైల్ లో నేటి తరం వారికి అనుగుణంగా సాఫ్ట్వేర్, మెరుగైన బ్యాటరీ చేర్చారు. అయితే దీనిని భారీ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. అది ఎలా అంటే?
iQOO నుంచి 15 R మొబైల్ ఇక కొనుగోలు చేయవచ్చు. 8 జిబి రామ్, 256 జీబీ స్టోరేజ్తో ఉన్న మొబైల్ రూ.44,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే 12gb రామ్ 256 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ రూ 47,999 గా నిర్ణయించారు. అయితే ఈ మొబైల్స్ ను HDFC, Axis బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా రూ.1,899 విలువైన బాండింగ్ పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ఐక్యూ15 ఆర్ మొబైల్ సిల్వర్ కలర్ లలో అందుబాటులో ఉండనుంది. దీనిని ఆమెజాన్ తోపాటు రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.
ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్లో 6.59 అంగుళాల 1.5 k AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది 8 జెన్ 5 చిప్ సెట్ ఉండే ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా అమర్చారు. అలాగే 8 MP ఆల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేసే కెమెరా ఉంది. 32 MP సెల్ఫీ కెమెరా ఉండడంతో వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ లో 5g కనెక్టివిటీ, వైఫై 7, బ్లూటూత్ 6, జిపిఎస్, USB type C పోర్ట్ ఉన్నాయి. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కు అనుగుణంగా ఈ మొబైల్ వినియోగించుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 7,600 mAh బ్యాటరీ చేర్చారు. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పాటు ఎక్కువసేపు ఫోన్ వినియోగించే వారికి సపోర్ట్ చేస్తుంది. కొత్తగా మొబైల్ కొనాలని అనుకునేవారు.. ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకునే వారు సైతం ఈ మొబైల్ బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.