https://oktelugu.com/

Tarun-Aarthi Agarwal: తరుణ్ , ఆర్తీ అగర్వాల్ పెళ్లి అందుకే ఆగిపోయిందా..?

అయితే ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇద్దరు కలిసి నువ్వు లేకనేను లేను, సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు. ఇంకా ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమ గా మారినట్టు గా తెలుస్తుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2023 / 10:45 AM IST
    Follow us on

    Tarun-Aarthi Agarwal: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులు సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ అనేది చిగురించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్,హీరో తరుణ్ ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు… ఇక వీళ్ళ పెళ్లి కి ఇంట్లో వాళ్ళు నిరాకరించడం తో ఇద్దరు సపరేట్ అయిపోయారు.

    దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆర్తీ అగర్వాల్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అయితే ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇద్దరు కలిసి నువ్వు లేకనేను లేను, సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు. ఇంకా ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమ గా మారినట్టు గా తెలుస్తుంది. ఇక ఆ టైం లోనే తరుణ్ ఆర్తీ అగర్వాల్ ని పెళ్లి చేసుకోకపోవడంతో ఆర్తీ అగర్వాల్ వేరే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

    ఇంకా ఆ తర్వాత ఆమె రాజశేఖర్ తో గోరింటాకు అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.అయితే తను ఓవర్ వెయిట్ కారణంగా సర్జరీ చేయించుకునే క్రమంలో చనిపోయింది…ఇక ఆ టైం లో తరుణ్ కి కూడా హీరో గా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం తరుణ్ చేసిన ఈ ప్రేమ వ్యవహారమే…ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే బయటికి వచ్చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అప్పట్లో చాలా మంది తరుణ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేసారు. అందువల్లే ఆయన చేసిన సినిమాలను చూడటానికి కూడా జనం ఇష్టపడలేదు.ఇక ఇలా తన పర్సనల్ ఇష్యూస్ వల్లనే తరుణ్ జనాల్లో చాలా బ్యాడ్ అయిపోయాడు. దానివల్ల ఆయన ఇండస్ట్రీలో చాలావరకు క్రేజ్ ని కోల్పోయి అభిమానులు అతన్ని అసహ్యించుకున్నారు.

    ఇక దానికి తోడు ఆయనకి మంచి సినిమాలు పడకపోవడం తో ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నప్పటికీ ఆయనకి అంత మంచి క్యారెక్టర్లు అయితే రావడం లేదు…దానికి తగ్గట్టు గానే ఇప్పుడు తరుణ్ ని స్క్రీన్ మీద చూసే ప్రేక్షకులు కూడా ఎవరు లేరని. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు…నిజానికి ఆయన అప్పుడు జాగ్రత్తగా చనిమలు చేసుకుంటూ వస్తె ఇప్పుడు తను స్టార్ హీరో గా ఇండస్ట్రీ లి ఉండేవాడు…