Gautam Gambhir Emotional: గెలవడానికి అవకాశాలు లేని చోట.. అవకాశాలను సృష్టించుకుంది టీం ఇండియా. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్లో చివరి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. సిరాజ్ అదరగొట్టిన వేళ.. ప్రసిద్ద్ తన వంతు పాత్ర పోషించిన వేళ.. టీమిండియా ఉత్కంఠ భరితమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఆతిథ్య జట్టుకు వారి సొంత దేశంలోనే ఝలక్ ఇచ్చింది..
Also Read: అందరూ సిరాజ్ ను పొగుడుతున్నారు కానీ.. ప్రసిద్ద్ చేసింది తక్కువేం కాదు..
ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం ముగ్గురు బౌలర్లతోనే రంగంలోకి దిగింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలర్లు అయినప్పటికీ.. వారిద్దరిని ఆల్ రౌండర్ లుగానే పరిగణించాల్సి ఉంటుంది. ముగ్గురు బౌలర్లను తీసుకొని ప్రయోగం చేసిన టీమ్ ఇండియాకు.. తొలి ఇన్నింగ్స్ లో అనుకూలమైన ఫలితమే వచ్చింది. రెండవ ఇన్నింగ్స్ లోనే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. కీలకమైన క్యాచ్లను ఫీల్డర్లు వదిలేయడం.. బౌలర్లు అలసిపోవడం వల్ల భారీ లక్ష్యం కాస్త క్రమేపీ కరిగిపోతూ వచ్చింది. చివరికి ఓటమి తప్పదనిపించింది. దీనంతటికీ కారణం గంభీర్ తీసుకొని నిర్ణయాలేనని అందరూ విమర్శించడం మొదలుపెట్టారు.. ఇక జాతీయ మీడియాలో అయితే గంభీర్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది.
Also Read: క్లీన్ స్వీప్ నుంచి రికార్డులు బద్దలు కొట్టేదాకా.. టీమిండియా యంగ్ ప్లేయర్ల ప్రస్థానం సాగిందిలా..
ఒకానొక దశలో టీమిండియా ఓటమి అంచులో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ తల పట్టుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక కొద్దిసేపు దూరంగా వెళ్లిపోయాడు. ఈ సమయంలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. రెట్టించిన ఉత్సాహంతో దూసుకు వచ్చారు.. కీలకమైన వికెట్లు పడగొట్టడం.. విజయానికి అవసరమైన నాలుగు వికెట్లను ఐదవ సాధించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. దీంతో భారత్ ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది.. టెస్ట్ క్రికెట్లో అత్యంత తక్కువ మార్జిన్ తో గెలుపొందింది. ఈ విజయం ద్వారా డబ్ల్యుటిసి పాయింట్లు పట్టికలో భారత్ మూడో స్థానంలోకి చేరుకుంది. మరోవైపు టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత గౌతమ్ గంభీర్ యాహూ అంటూ నినాదాలు చేశాడు. సాధించాం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను గట్టిగా ఆలింగనం చేసుకొని ముద్దు కూడా పెట్టాడు. దీనిని బట్టి గౌతమ్ గంభీర్ ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవచ్చు.
RAW EMOTIONS AT OVAL BY INDIAN TEAM. ❤️
THIS IS INDIAN TEST CRICKET…!!! pic.twitter.com/oVnPfvbJxs
— Johns. (@CricCrazyJohns) August 4, 2025