Varun Chakravarthy Vs Tim David: మామూలుగా అయితే ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తుంది అని అందరికీ తెలుసు. పర్యాటక జట్టుగా వెళ్ళినా.. ఆతిధ్య జట్టుగా వెళ్లినా ఆస్ట్రేలియా ఇతర జట్ల మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని అంశాలలో అదరగొడుతూ ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టుకు బలమైన పోటీ ఇచ్చి.. చుక్కలు చూపించే జట్టు ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. ఇక ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇటీవలి వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఐదు టి20 మ్యాచ్లో సిరీస్ గెలవాలని లక్ష్యంతో ఉంది. తొలి టి20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. రెండో మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకొంది. టీమ్ ఇండియాను కేవలం 125 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఓపెన్ అభిషేక్ శర్మ గనుక 68 పరుగులు చేయకుండా ఉండి ఉంటే టీమ్ ఇండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. చివరికి బౌలర్ అభిషేక్ శర్మ 35 పరుగులు చేసి జట్టు పరువును కాస్తలో కాస్త కాపాడాడు. వాస్తవానికి ఇటీవల టీ20 లలో టీమిండియా కు తిరుగులేదు. టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా t20 లలో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అటువంటి జట్టు ఆస్ట్రేలియా మీద అద్భుతమైన ప్రదర్శన చేస్తుందనుకుంటే.. నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది.
126 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు దుమ్మురేపారు. మిగతా ఆటగాళ్లు కూడా సత్తా చూపించారు. ఆస్ట్రేలియా జట్టు విజయం లాంచనమే అయినప్పటికీ.. ఒక దశలో టీమిండియా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా తడబడింది. చివరికి కుదురుకొని లక్ష్యాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో ఒక సన్నివేశం మాత్రం హైలెట్ గా నిలిచింది. టీమిండియా బౌలర్, టి20లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ తో మైండ్ గేమ్ ఆడాడు. ముందుగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తుండగా డేవిడ్ అకారణంగా తప్పుకున్నాడు. దీంతో వరం చక్రవర్తి లయ పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తర్వాత మళ్లీ బంతి వేయడానికి వచ్చిన వరుణ్ చక్రవర్తి అకస్మాత్తుగా ఆగిపోయాడు. దీంతో ఈసారి డేవిడ్ లయను తప్పాడు. చివరికి వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బంతివేసి డేవిడ్ కాట్ అండ్ బోల్డ్ చేశాడు. దీంతో డేవిడ్ తో సాగిన యుద్ధంలో వరుణ్ చక్రవర్తి పై చేయి సాధించాడు. వాస్తవానికి వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారం పూర్తిస్థాయి మైండ్ గేమ్ ను ఆవిష్కరించింది. వ్యాఖ్యతలు కూడా అదే విషయాన్ని కామెంట్రీ రూపంలో చెప్పడం విశేషం.
At the end Varun Chakaravarthy won the battle of serious mind games against Tim David
– That’s why he’s the No.1 T20I Bowler with a massive rating of 803
– What’s your take pic.twitter.com/GWwG3fYfz9
— Richard Kettleborough (@RichKettle07) October 31, 2025