Producer Naga Vamsi Career: నిన్న మొన్నటి వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాగవంశీ, ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ ని అందుకుంటూ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి పడిపోయాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత నాగవంశీ అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత మాత్రమే కాదు, అత్యధిక కల్ట్ క్లాసిక్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కూడా. కానీ ‘రెట్రో’ చిత్రం నుండి ఆయన పడిపోవడం. సూర్య హీరో గా నటించిన ఈ సినిమాకు సంబందించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన నాగవంశీ కి 6 కోట్ల రూపాయిల నష్టాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో నిర్మించిన ‘కింగ్డమ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
Also Read: పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?
ఈ సినిమాకు కూడా ఆయన భారీగానే నష్టపోయాడు. కానీ ఇవేమి ఆయన కెరీర్ పై ప్రభావం చూపించే రేంజ్ కావు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2’ మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొన్నాడో, అప్పటి నుండి నాగవంశీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడు. 92 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేస్తే, కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎదుగుతున్న ఒక నిర్మాతకు 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఈ సినిమా వల్ల ఆయన తీవ్రమైన విమర్శలను కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేసిన లోక అనే చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. అయితే ఈరోజు విడుదలైన ‘మాస్ జాతర’ చిత్రం తో భారీ హిట్ ని అందుకొని కం బ్యాక్ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు.
కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రీమియర్ షోస్ నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలే 15 కోట్ల నష్టాలతో ఈ సినిమాని విడుదల చేసాడు నాగవంశీ. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయితే, ఆయన పెట్టిన 35 కోట్ల రూపాయిల బడ్జెట్ మొత్తం బూడిద లో పోసిన పన్నీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని వరుస ఎదురు దెబ్బలు తర్వాత నాగవంశీ కి ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ని నిర్మించేంత బడ్జెట్ ఉంటుందా?. ఇది కాకుండా ఆయన జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి ఒక సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదైనా వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు. రెమ్యూనరేషన్స్ యే వంద కోట్లు ఉంటుంది. చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూ వచ్చి ఉండుంటే ఆయన పరిస్థితి ఈరోజు వేరేలా ఉండేది. ప్రస్తుతం సూర్య తో ఒక సినిమా, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేదంటే నాగవంశీ కెరీర్ మనుగడ సాగించడం కష్టమే.