Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ తో ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. దిగ్గజ బౌలర్లను సైతం నేల నాకించాడు. దీంతో అతని గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఐపీఎల్ లోకి కేవలం 14 సంవత్సరాల వయసులోనే అతడు ఎంట్రీ ఇవ్వడమే ఒక సంచలనం అనుకుంటే.. మూడో మ్యాచ్లోనే అతడు ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో సెంచరీ చేశాడు. 35 బాల్స్ లోనే సెంచూరియన్ అయ్యాడు. వాస్తవానికి వైభవ్ సూర్యవంశీ వయసు ఉన్న పిల్లలు స్కూల్లో పాటల చదువుకుంటారు. తమ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటారు. కానీ వైభవ్ సూర్య వంశీ అందుకు భిన్నంగా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించడం ప్రారంభించాడు. అతడు ఆడుతున్న తీరు చూస్తే త్వరలోనే భారత జాతీయ జట్టులోకి ప్రవేశించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే దిగ్గజ ఆటగాళ్లతో సైతం అతడు భవిష్యత్తు తారగా అభినందనలు అందుకుంటున్నాడు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అతడు త్వరలోనే భారత జాతీయ జట్టులో కనిపించే అవకాశం ఉంది.
Also Read : వైభవ్ సూర్య వంశీ సెంచరీ..ఇషాంత్ శర్మ ను ఇలా తగులుకుంటున్నారేంట్రా!
సూర్యవంశీ మెరుపుల వెనుక
సూర్య వంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వెనుక మనిశ్ ఓజా ఉన్నాడు. జర కంటే ముందు భారత క్రికెట్ లెజెండ్స్ వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ కీ రోల్ ప్లే చేశారు. వివిఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీ లో ఉన్న టాలెంట్ ను ముందుగానే ఐడెంటిఫై చేశాడు. ఇదే క్రమంలో వైభవ్ బీసీసీఐ అండర్ -19 ఛాలెంజర్ టోర్నీలో అదరగొట్టాడు. అతని ఆట తీరు చూసిన జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ప్రోత్సాహం కల్పించాడు. లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరైన ఆ మ్యాచ్లో సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్ చేశాడు. 36 పరుగుల వద్ద అతడు రన్ అవుట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్ లో విపరీతంగా ఏడ్చాడు.. దీంతో అతని బాధ చూసి తట్టుకోలేక లక్ష్మణ్ అక్కడికి వెళ్ళాడు.” సూర్యవంశీ.. నువ్వు ఏడవకు. నువ్వు అవుట్ అయిన విధానం మేము చూడము. నువ్వు ఏ స్థాయిలో ఆడతావనేదే మేము పరిశీలిస్తాం. నీలో నైపుణ్యం ఉంది. దీర్ఘకాలం క్రికెట్ ఆడే సత్తా ఉంది.. నిన్ను కచ్చితంగా సాన పెడతాం. క్రికెట్ లో సరికొత్త శిఖరాలు అధిరోహించుకునేలా చేస్తామని” లక్ష్మణ్ వైభవ్ సూర్య వంశీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో వైభవ్ ఏడుపు ఆపేశాడు.. ఇక ఇదే విషయాన్ని మనోజ్ ఓజా ఇటీవల ఓ ఇంటర్ విలువ వెల్లడించారు. ఆ తర్వాత అండర్ 19 నాలుగు దేశాల టోర్నీలో తలపడే భారత జట్టులోకి వైభవ్ కు లక్ష్మణ్ అవకాశం కల్పించాడు. అంతేకాదు జాతీయ అకాడమీలో వైభవ్ ఆట తీరు మరింత మెరుగుపడే విధంగా దృష్టి సారించాడు. ఇక ఇదే విషయాన్ని రాహుల్ ద్రావిడ్ కు లక్ష్మణ్ అనేక సందర్భాల్లో చెప్పాడు. దీంతో రాహుల్ ద్రావిడ్ వైభవ్ ఆట తీరును పరిశీలించాడు. అతడు ఆడుతున్న తీరు రాహుల్ ద్రావిడ్ కు ఆశరాన్ని కలిగించింది. వెంటనే మెగా వేలంలో సూర్యవంశీని సొంతం చేసుకోవడానికి మరో జట్టు ప్రయత్నించినప్పటికీ.. రాహుల్ ద్రావిడ్ వెనకడుగు వేయలేదు. అదనంగా మరో 10 లక్షలు చెల్లిస్తామని చెప్పి వైభవ్ ను రాజస్థాన్ దక్కించుకునే విధంగా చేశాడు. దానివల్ల రాజస్థాన్ జట్టు ఏ స్థాయిలో లాభం సాధించిందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..” వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే అతడు మొదట రాటు తేలింది వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో.. ఆ తర్వాతే రాహుల్ ద్రావిడ్ కంటపడ్డాడు. ఇప్పుడు మేరునగ ధీరుడిలాగా ఆడుతున్నాడు. అందువల్లే వైభవ్ సూర్యవంశీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. వైభవ్ సూర్య వంశీ ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే.. అది వివిఎస్ లక్ష్మణ్ కే అని” నెటిజన్లు అంటున్నారు.
Also Read : ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం