Vaibhav Surya Vamsi : గుజరాత్ టైటాన్స్ కు భయం అంటే ఎలా ఉంటుందో చూపించాడు… భగభగ మండే సూర్యుడిలాగా వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు.. ముఖ్యంగా గుజరాత్ బౌలర్ ఇశాంత్ శర్మ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు సాధించాడు.. తద్వారా సరికొత్త రికార్డును ఐపీఎల్ లో నెలకొల్పాడు. ఇషాంత్ శర్మ టీమ్ ఇండియాలోకి 2007లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఇంకా వైభవ్ సూర్యవంశీ ఇంకా పుట్టనే లేదు. 2011లో వైభవ్ సూర్య వంశీ జన్మించాడు. ఇషాంత్ శర్మ ఎంతో సీనియర్ బౌలర్. ఫేస్ బౌలింగ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన బౌలర్. అతని బౌలింగ్ లో వైభవ్ సూర్య వంశీ ఏమాత్రం భయపడలేదు. పైగా తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. బంతులను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించాడు. 360 డిగ్రీల కోణంలో ప్రతి బంతిని మైదానాన్ని తాకేలా చేశాడు. ఇక ఎప్పుడైతే ఇశాంత్ శర్మ బౌలింగ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడో.. అప్పటినుంచి వైభవ్ ఒకసారి గా సూపర్ హీరో అయిపోయాడు. ఇక ఇప్పుడు నడుస్తున్నవన్నీ సోషల్ మీడియా రోజులు కాబట్టి.. మీమర్స్ తమ చేతికి పని చెప్పారు. తమ బుర్రకు పదును పెట్టారు. రకరకాల వీడియోలను రూపొందించడం మొదలుపెట్టారు.
Also Read : వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో ఈ బుడ్డోడే ఇప్పడు వైరల్
అప్పుడు ఇంకా పుట్టలేదు
2007లో ఇశాంత్ శర్మ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్, వన్డే, టి20 ఫార్మేట్ లలో అదరగొట్టాడు.. మ్యాచ్ విని పెర్ఫార్మన్స్ చేశాడు. ప్రస్తుతం అతడు టీమిండియా లో కాకుండా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఇశాంత్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. అతంటి సీనియర్ బౌలర్ ను సైతం వైభవ్ సూర్య వంశీ పడుకోబెట్టాడు. తన సూపర్ బ్యాటింగ్ పవర్ తో నేల నాకించాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా పరుగులు చేశాడు. 2007లో ఇషాంత్ శర్మ భారత జాతీయ క్రికెట్ జట్టులోకి ఆగమనం చేశాడు.. 2011లో వైభవ్ సూర్య వంశీ బీహార్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టాడు. అయితే వయసు పరంగా చూసుకుంటే ఇషాంత్ శర్మ ఏజ్ లో కనీసం పావు వంతు కంటే ఎక్కువగా ఉంటాడు.. వైభవ్ సూర్య వంశీ చండ ప్రచండమైన బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ లోని జైపూర్ మైదానంలో రైజింగ్ సన్ లాగా ఆవిర్భవించాడు. తద్వారా సరికొత్త ధ్రువతారగా ఎదిగాడు. ” ఇషాంత్ శర్మ ఏజ్ లో సగం కూడా ఉండడు. అతడు టీమిండియాలోకి ప్రవేశించినప్పుడు అతడు పుట్టను కూడా పుట్టలేదు. అటువంటి పిల్ల బచ్చాగాడు.. ఇషాంత్ శర్మ బౌలింగ్ ను తునా తునకలు చేశాడు.. ఐపీఎల్ లో అదరగొట్టాడు. మొత్తంగా సూపర్ హీరో అనిపించుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన బలమైన బ్యాటింగ్ ద్వారా.. భవిష్యత్తు కాలానికి కాబోయే సూపర్ బ్యాటర్ నని వైభవ్ నిరూపించుకున్నాడని” మీమర్స్ తమ రూపొందించిన వీడియోలో పేర్కొన్నారు.
Also Read : ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం