Maruti : కొన్నేళ్ల క్రితం టాటా మోటార్స్ దేశంలో నెక్సాన్‌ను విడుదల చేసిన సమయంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మంచి పేరు, డబ్బు సంపాదించింది. ఇది మారుతి సుజుకి ఇండియా కార్లలో సేఫ్టీ గురించి ప్రజల ఆందోళనను అమాంతం పెంచింది. తరువాత మహీంద్రా నుంచి స్కోడా, ఎంజి వంటి ఇతర కార్ల కంపెనీలు కూడా సేఫ్టీ రేటింగ్‌తో కార్లను తీసుకురావడం ప్రారంభించాయి. కానీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన అసలు సత్తా ఏమిటో చూపించడానికి రెడీ అయింది. కంపెనీ ఒకటి లేదా రెండు కాదు త్వరలో అన్ని కార్లు సేఫ్టీలో నంబర్ వన్‌గా ఉండబోతున్నాయి.
మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్.సి. భార్గవ భారత్, ప్రపంచం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం చివరి నాటికి మారుతి ప్రతి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయని ఆయన అన్నారు. ఆటోకార్ ప్రకారం, ప్రతి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌ల గురించి ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, తాము ఈ పని త్వరలోనే చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీని వల్ల తమకు కూడా లాభం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read : ఆరు నెలల్లోనే 94 వేలకు పైగా అమ్మకాలు.. ధర కూడా అంతంతే.. ఈ ఫెవరెట్ కారు గురించి తెలుసుకుందామా?
మారుతి సుజుకి ఇటీవల తన అనేక కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించడం ప్రారంభించింది. వాటిలో మారుతి ఈకో, వ్యాగన్‌ఆర్, ఆల్టో కె10, బ్రెజ్జా, సెలెరియో ఉన్నాయి. దీని కారణంగా ఈ కార్ల ధర కూడా పెరిగింది. ఈ సంవత్సరం నుంచి వచ్చే ఈ కార్లన్నింటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభించనున్నాయి. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు లేని మిగిలిన కార్లలో బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్-6, ఎస్-ప్రెస్సో ఉన్నాయి.
ఫ్రాంక్స్, బాలెనో టాప్ వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి. కానీ ఇప్పుడు వాటి ఎంట్రీ-లెవెల్ రేంజ్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి. అయితే దీని వల్ల ఈ కార్ల ధర పెరుగుతుంది. ప్రస్తుతం ఫ్రాంక్స్ రూ.7.55 లక్షల నుండి , బాలెనో రూ.6.70 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అంతే కాదు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు రావడం వల్ల ఎర్టిగా, ఎక్స్‌ఎల్-6, ఎస్-ప్రెస్సో ధర కూడా పెరగడం ఖాయం. మారుతి సెలెరియోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చినప్పుడు దాని ధర రూ.32,500 వరకు పెరిగింది.
మారుతి కార్ల గురించి ప్రస్తుతం చాలా మందికి ఉన్న ప్రధాన ఆందోళన సేఫ్టీ గురించే. ఇప్పుడు సేఫ్టీ మీద దృష్టి పెంచామని మారుతి చెబుతోంది. గత సంవత్సరం కంపెనీ తన మొదటి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు మారుతి డిజైర్‌ను ఇండియాలో విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా ఎంట్రీ-లెవెల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయని మారుతి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ అన్నారు. వాటి ధర మరింత పెరిగితే, వాటి అమ్మకాలు మరింత తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : మారుతి స్విప్ట్.. సేప్టీ రేటింగ్ లో దీని ర్యాంక్ ఎంతంటే? ఇది నమ్మగలరా? అసలు విషయమేంటంటే?