Instagram : చాలా మంది ఎవరైనా ఇన్ స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిపోతే బాగా డబ్బులు వస్తాయని అనుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతే ఇన్ స్టాగ్రామే వాళ్లకు డబ్బులు దండిగా ఇస్తుందని భావిస్తారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఇన్స్‌టాగ్రామ్ ఎప్పుడూ యూజర్లకు డైరెక్ట్‌గా డబ్బులు ఇవ్వదు. నిజానికి ఇన్స్‌టాగ్రామ్ అనేది ఒక వేదిక మాత్రమే. దానిలో మనం మన ఫోటోలు, వీడియోలు, రీల్స్ పెట్టుకోవచ్చు, ఫాలోవర్స్‌ను పెంచుకోవచ్చు. కానీ డబ్బు సంపాదించాలంటే ఇన్స్‌టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వడంతో పాటు ఇంకా చాలా విషయాలపై దృష్టి పెట్టాలి.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
ఇన్ఫ్లుయెన్సర్‌లకు వచ్చే డబ్బులు ఇన్స్‌టాగ్రామ్ నుంచి కాదు. బ్రాండ్స్, కంపెనీల నుంచి వస్తాయి. ఎప్పుడైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందో అప్పుడు బ్రాండ్స్ వాళ్ల ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి వీళ్లకు డబ్బులు ఇస్తాయి. ఇందులో డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. స్పాన్సర్డ్ పోస్ట్‌లు, ఎఫిలియేట్ మార్కెటింగ్ లేదా సొంత ప్రోడక్ట్‌లు, సర్వీసులు అమ్మడం లాంటివి అన్నమాట.
ఇన్‌స్టాగ్రామ్ కేవలం ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే. దానిలో ఇన్ఫ్లుయెన్సర్‌లు వాళ్ల కంటెంట్‌తో జనాలను కనెక్ట్ చేస్తారు. కానీ పైన చెప్పినట్టు ఇన్స్‌టాగ్రామ్ డైరెక్ట్‌గా డబ్బులు ఇవ్వదు. లైవ్‌లో బాడ్జ్‌లు లేదా రీల్స్ బోనస్ లాంటి కొన్ని ఫీచర్స్ కొన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ ఇండియా, పాకిస్తాన్‌లో ఇవి కొద్దిమంది యూజర్లకే అందుబాటులో ఉన్నాయి.
Also Read : యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్..
ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తుంది?
ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఫీచర్ల ద్వారా డైరెక్ట్‌గా పేమెంట్ ఇస్తుంది.. కానీ ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో లేదు. ఇన్‌స్టాగ్రామ్ బోనస్‌లు, లైవ్ వీడియోలపై బాడ్జ్‌లు ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్ బోనస్‌లు: అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఇన్స్‌టాగ్రామ్ సెలెక్టెడ్ కంటెంట్ క్రియేటర్లకు రీల్స్ చేసినందుకు బోనస్ ఇస్తుంది. ఈ ఫీచర్ ఇండియా, పాకిస్తాన్‌లో ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు.
లైవ్ వీడియోలలో బాడ్జ్‌లు: ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్‌కి వచ్చినప్పుడు, ఫాలోవర్స్ వాళ్లకు బాడ్జ్ కొని సపోర్ట్ చేయొచ్చు. ఆ డబ్బుల్ని ఇన్స్‌టాగ్రామ్ క్రియేటర్‌కు ఇస్తుంది. ఈ ఫీచర్ కూడా కొన్ని దేశాల్లో కొద్దిమందికే ఉంది.
Also Read : వీడు మామూలోడు కాదు.. తల్లీకూతుళ్ళను ఒకేసారి గర్భవతులను చేశాడు.. వైరల్ వీడియో