LSG Vs RR IPL 2025: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బౌలర్లు అద్భుతాలు చేస్తున్నారు. లో స్కోర్ నమోదు అవుతున్న మ్యాచుల్లో తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో సంచలనం చోటు చేసుకుంది.బెంగళూరు వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో అద్భుతం జరిగింది. ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లోనూ చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. తాజాగా లక్నో వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లోనూ ఇదే తీరుగా సంచలనం నమోదైంది. ఇక ఈ మ్యాచ్లలో బ్యాటర్ల కంటే బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు.. పెను తుఫాను స్థాయిలో బౌలింగ్ చేశారు. ఓ రేంజ్ లో బంతులు వేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నిప్పులు చెరిగే విధంగా బంతులు వేసి.. బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అంతేకాదు మ్యాచ్ విన్నర్లు అయ్యారు. అందువల్లే ఈ ఐపీఎల్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. రెండు లేదా మూడు సందర్భాల్లో మాత్రమే 240+ కి స్కోర్లు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ సీజన్లో పరుగుల వరద పారుతుందని.. బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని అంచనాలు వినిపించాయి. కానీ వాటన్నింటికీ మించి.. వాటన్నింటినీ తలకిందులు చేస్తూ బౌలర్లు ప్రతిభ చూపుతున్నారు. వికెట్లను పడగొడుతూ సంచలనం సృష్టిస్తున్నారు.
Also Read: 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో
ఆ రికార్డులు ఆ రెండు జట్లపై..
శనివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఏ మ్యాచ్ లో లక్నో పోరాటాన్ని చూపించింది. చివరికి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అతి తక్కువ పరుగుల తేడాతో మూడుసార్లు ఓటమిపాలైంది. 2024 లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 2025లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.
తక్కువ పరుగుల తేడాతో గెలుపు
ఇక ఈ మ్యాచ్ ద్వారా లక్నో జట్టు మరో చరిత్ర సృష్టించింది. 2023లో కోల్ కతా జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై 2022లో రెండు పరుగుల తేడాతో లక్నో గెలిచింది. 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 2 రన్స్ తేడాతో విక్టరీ ని సొంతం చేసుకుంది.. 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ పై నాలుగు పరుగుల తేడాతో ఉత్కంఠ మధ్య అద్భుతమైన విజయం సాధించింది. 2023లో ముంబై ఇండియన్స్ పై ఐదుపరుగుల తేడాతో విజయం దక్కించుకుంది.
Also Read: అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు లక్నో.. రాజస్థాన్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందేమో?