Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ లక్నోతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. తను ఎదుర్కొన్న తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ మ్యాచ్లో ఏకంగా 20 బాల్స్ లో 34 రన్స్ చేశాడు. అతడు హాఫ్ సెంచరీ వైపుగా ప్రయాణం చేస్తుండగా.. ఉన్నట్టుండి అవుట్ అయ్యాడు. దీంతో మైదానాన్ని ఈ వీడి వెళ్లే సమయంలో వైభవ్ సూర్య వంశీ తన కళ్ళను తుడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి పోయిన తర్వాత తోటి ప్లేయర్లు భుజం తట్టి అనునయించారు. ఏం కాదులే.. ఇలాంటి సహజ అంటూ ఓదార్చారు.
Also Read : టెస్ట్ లకు దూరమైనా.. విరాట్ రేంజ్ తగ్గలేదు.. ఇదీ 1,050 కోట్ల దండయాత్ర..
ఏడవ లేదట
లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏడ్చిన విషయాన్ని వైభవ్ సూర్య వంశీ ముందు విలేకరులు ప్రస్తావించారు. మంగళవారం చెన్నై జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించిన అనంతరం వైభవ్ సూర్య వంశీ నాటి తన ఏడుపుకు సంబంధించిన అసలైన విషయాన్ని ఇప్పుడు వెల్లడించాడు..”నన్ను చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. వాస్తవానికి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో నేను ఏడవలేదు. నేను వేగంగా పరుగులు చేశాను. అదే సమయంలో అవుట్ అయ్యాను. అయితే ఫ్లడ్ లైట్ల కాంతి నా కళ్ళను వెంటనే తాకింది. ఆ ప్రభావం వల్ల నా కళ్ళను తుడుచుకోవాల్సి వచ్చింది.. అది మీ అందరికీ ఏడుపులాగా కనిపించింది. ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న వేసి నాతో కామెడీ చేస్తున్నారు. ఇప్పటికైనా కామెడీ ఆపండి.. నేను ఆ మ్యాచ్లో ఏడవలేదు.. చివరికి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే వెనక్కి వచ్చినప్పటికీ.. నన్ను ఏడ్చారు అంటూ కామెంట్ చేశారు. ఇప్పటికైనా అసలు విషయాన్నీ తెలుసుకోండి. నేనే క్లారిటీ ఇస్తున్నాను కదా” అంటూ వైభవ్ సూర్య వంశీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. తన ఏడుపుకు సంబంధించి వస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాడు.
ఇక చెన్నై జట్టుపై విజయం సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఆర్థ శతకం చేసిన అతడు రాజస్థాన్ విక్టరీలో తన వంతు పాత్ర పోషించాడు. చెన్నై పై గెలిచిన తర్వాత.. వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కారం చేశాడు. ఈ సందర్భంగా ధోని వైభవ్ సూర్యవంశీని దగ్గరికి తీసుకున్నాడు. అతడి చెవిలో ఏదో చెప్పాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 15 సంవత్సరాలు నిండని బాలుడైనప్పటికీ వైభవ్ చూపించిన పరిపక్వత పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. అతడు ఇలాగే ఆడాలని.. టీమిండియాలో చోటు సంపాదించాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : పది”లో వైభవ్ సూర్య వంశీ ఫెయిల్.. ఇదీ అసలు జరిగింది!