Homeఎంటర్టైన్మెంట్Amar Deep's wife : బిగ్ బాస్ అమర్ దీప్ భార్య అలాంటిదిగా, భర్తతో గొడవైతే...

Amar Deep’s wife : బిగ్ బాస్ అమర్ దీప్ భార్య అలాంటిదిగా, భర్తతో గొడవైతే ఏం చేస్తుందో తెలుసా?

Amar Deep’s wife : బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సీరియల్ యాక్ట్రెస్ తేజస్వినితో ఆయన ఏడడుగులు వేశాడు. వృత్తిరీత్యా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి పీటలు ఎక్కువ తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. లవ్లీ బుల్లితెర కపుల్ గా ఈ జంటకు పేరుంది. ఈ మధ్య వీరు సీరియల్స్ చేయడం మానేశారు. సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి అమర్ దీప్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్ట్ చేశాడు. కొంచెం లో టైటిల్ చేజార్చుకున్న అమర్ దీప్, రన్నర్ గా నిలిచాడు.

అమర్ దీప్ కి తేజస్విని మంచి సపోర్ట్ ఇస్తుంది. బిగ్ బాస్ అనంతరం అమర్ దీప్ కి హీరోగా కూడా ఛాన్స్ వచ్చింది. ఓ మూవీలో ఆయన నటిస్తున్నారు. అమర్ దీప్ కి జంటగా సురేఖావాణి కూతురు సుప్రీత నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం. ఒక పక్క హీరోగా చేస్తూనే బుల్లితెర షోలలో సందడి చేస్తున్నాడు అమర్ దీప్. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో అమర్ దీప్, తేజస్విని కంటెస్ట్ చేస్తున్నారు. తాజాగా తేజస్విని సుమ అడ్డా షోకి హాజరైంది.

Also Read : బిగ్ బాస్ కంటే నాకు అదే ముఖ్యం.. మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు అమర్ షాకింగ్ కామెంట్స్

తేజస్వినితో పాటు సీరియల్ యాక్ట్రెసెస్ ప్రిన్సీ, సింధూర, ఐశ్యర్య సైతం పాల్గొన్నారు. వీరితో సరదా గేమ్స్ ఆడించిన యాంకర్ సుమ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తేజస్విని ని సుమ ఒక ప్రశ్న అడిగారు. నీకు కోసం వస్తే పుట్టింటికి వెళ్తావా? లేక కొడతావా? అని అడగ్గా.. తడుముకోకుండా కొడతా… అని తేజస్విని సమాధానం చెప్పింది. పైకి సాఫ్ట్ గా కనిపించే తేజస్విని భర్తను కొడుతుందా? అని ఫ్యాన్స్ వాపోతున్నారు.

ఆ మధ్య అమర్ దీప్-తేజస్విని విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లకు వారు చెక్ పెట్టారు. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. మాకు కూడా గొడవలు అవుతుంటాయి. అయితే ఆ గొడవలు ఒక్క రోజులోనే సద్దుమణుగుతాయి. మేము కూడా అందరిలానే కొట్టుకుంటాము, వెంటనే కలిసిపోతామని టీజస్విని చెప్పుకొచ్చింది.

RELATED ARTICLES

Most Popular