Vaibhav Suryavanshi: రీసెంట్ గా గుజరాత్ టైటాన్స్ పై బ్యాట్ తో వీరవిహారం చేశాడు. ఏకంగా సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. సూర్యవంశీ ఆడిన తీరు పట్ల దిగ్గజ క్రికెటర్లు వర్షం వ్యక్తం చేశారు. అభినందనలతో వైభవ్ సూర్యవంశీని ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఈ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే కాస్త డిఫరెంట్ గా తన భావాన్ని వ్యక్తం చేశాడు. అయితే సునీల్ గా గవాస్కర్ చెప్పినట్టుగానే వైభవ్ సూర్య వంశీ ఆట తీరు సాగుతుండడం విశేషం.. వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసిన తర్వాత సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించాడు.” వైభవ్ సూర్యవంశీ గొప్పగా ఆడుతున్నాడు..
Also Read: నమ్మి కోట్లు కుమ్మరిస్తే.. రాజస్థాన్ రాయల్స్ ను నిండా ముంచారు కదరా!
అతడు మెగా వేలంలోకి వచ్చేసరికి.. యువ ఆటగాళ్లు ఆడే టెస్టులలో ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ చేశాడు.. 13 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా లాంటి జట్టుపై సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతడు తన ఆటకు మరింత పదును పెట్టాలి. ద్రావిడ్ నేతృత్వంలో అతడు మరింత గొప్ప ఆటగాడిగా ఆవిర్భవిస్తాడు. కాకపోతే అతడిని ప్రశంసలతో ఇప్పుడే ముంచెత్తకూడదు. ఐపీఎల్ లో తను ఎదుర్కొన్న తొలి బంతినే అతడు సిక్సర్ కొట్టాడు.. అలాంటప్పుడు మళ్ళీ ఆ అవకాశం అతడికి ఇవ్వకుండా.. అనుభవం ఉన్న బౌలర్లు.. అతడికి షార్ట్ పిచ్ తరహా బంతి వేస్తారు. దానిని అతడు అంచనా తెలియక అవుట్ అవుతాడు.. బంతి గమనాన్ని తప్పుగా అర్థం చేసుకొని చెత్త షాట్ కొడతాడు. ఆ తర్వాత అతడు పెవిలియన్ చేరుకుంటాడని” సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అతడు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే వైభవ్ ఔట్ అయ్యాడు.
ముంబై జట్టుతో..
ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. తాను ఎదుర్కొన్న రెండవ బంతికే అవుట్ అయ్యాడు. దీపక్ చాహర్ షార్ట్ పిచ్ బంతివేసి వైభవ్ ను రెచ్చగొట్టాడు. అయితే ఆ బంతిని అంచనా వేయలేక.. వైభవ్ విఫలమయ్యాడు. అతడు కొట్టిన షాట్ మిడ్ ఆన్ లో ఉన్న ముంబై ఫీల్డర్ చేతికి చిక్కింది. తద్వారా 0 పరుగులకే వైభవ్ అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన వెంటనే..ఇలా ఆడితే కెరియర్ క్లోజ్ అయినట్టేనని.. క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. మరోవైపు వైభవ్ అవుట్ అయిన తర్వాత ముంబై ఆటగాడు రోహిత్ శర్మ.. తనలో ఉన్న అసలు సిసలైన క్రికెటర్ ను బయటికి తీశాడు. వైభవ్ సూర్య వంశీకి అండగా ఉన్నాడు. భుజం తట్టి “ఏం కాదు.. ధైర్యంగా ఉంటూ ” అంటూ హితవచనాలు చెప్పాడు.
Also Read: వివాదం : గడువు ముగిశాక రోహిత్ రివ్యూ.. ఎంపైర్లు ఎందుకు అనుమతించారు