Rajasthan Royals : ఈ ప్రాథమిక సూత్రాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం విస్మరించినట్టుంది. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరంలో విజేతగా నిలిచిన రాజస్థాన్.. ఆ తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఏదో ఒక దశలో ఓడిపోవడం.. అభిమానుల ఆశలను నీరుగార్చడం.. వంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ జట్టు యాజమాన్యం తీరు మారడం లేదు. మెగా వేలంలో, మినీ వేలంలో సమర్థవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేయలేక.. ఆటగాళ్ల సామర్థ్యంపై ఒక అంచనా లేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇక తాజా సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన వైఫల్యాన్ని కొనసాగించింది.. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ బీభత్సమైన ఆట తీర్ ప్రదర్శించలేక చతికిల పడింది. అంతేకాదు మెగా వేలంలోనూ ఆ జట్టు చేసిన భారీ తప్పిదాలు శాపాలుగా మారాయి. అ జట్టును గ్రూప్ దశ నుంచే నిష్క్రమించేలా చేశాయి.
Also Read : రాజస్థాన్ రాయల్స్.. గొర్రె మంద సామెతను నిజం చేసింది.
వారిని ఎందుకు వదిలిపెట్టినట్టు
రాజస్థాన్ రాయల్స్ జట్టులో గతంలో బట్లర్, బౌల్ట్, యజువేంద్ర చాహలు ఉండేవారు. వీరంతా కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకునేవారు. గత సీజన్లో రాజస్థాన్ ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది అంటే.. దానికి ప్రధాన కారణం ఈ ముగ్గురు ఆటగాళ్లే.. అయితే మెగా వేలంలో ఈ ముగ్గురిని రాజస్థాన్ యాజమాన్యం వదులుకుంది. సంజు శాంసన్ కు 18 కోట్లు, ధ్రువ్ జూరెల్ కు 14 కోట్లు, రియాన్ పరాగ్ కు 14 కోట్లు, హిట్ మేయర్ కు 11 కోట్లు చెల్లించి జట్టులో ఉంచుకుంది. అది ఎంత భారీ తప్పిదమో ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుకు అనుభవంలోకి వచ్చింది. మెగా వేలంలో వేరే జట్లకు అమ్ముడుపోయిన బట్లర్, బౌల్ట్, చాహల్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్నారు. చాహల్ పంజాబ్ జట్టు సాధిస్తున్న విజయాలలో కీలకంగా మారాడు. బౌల్ట్ ముంబై జట్టులో కీలక బౌలర్ గా అవతరించాడు. బట్లర్ గుజరాత్ టైటాన్స్ జట్టులో కీ ప్లేయర్ గా మారాడు. అటు పంజాబ్, ఇటు ముంబై, మధ్యలో గుజరాత్.. పాయింట్లు పట్టికలో టాప్ -4 లో ఉన్నాయి. అయితే వారిని దూరం చేసుకుని రాజస్థాన్ జట్టు గ్రూప్ దశ నుంచే వెళ్ళిపోయింది.. సంజు శాంసన్ గాయం వల్ల టోర్నీ మధ్య నుంచే వెళ్లిపోయాడు.. ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్, హిట్ మేయర్.. ఏమాత్రం రాణించలేకపోయారు. వీరినే నమ్ముకున్న ముంబై జట్టు యాజమాన్యాన్ని నిండా ముంచారు. గత సీజన్లో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ వెళ్ళింది. కానీ ఈ సీజన్లో మాత్రం గ్రూప్ దశలోనే ఆగిపోయింది. ఆటతీరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
18Cr – Sanju Samson
14Cr – Dhruv Jurel
14Cr – Riyan Parag
11Cr – S HetmyreLeft Butler, Boult & Chahal
Em dikkumalina retentions ra ivi @rajasthanroyals pic.twitter.com/dWMHQXSwA3— AdityaVarma (@AdityaVarma45_) May 1, 2025