Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) సినిమా సినిమాకు తన రేంజ్ ని ఎలా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘దసరా’ నుండి వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఆయన, మీడియం రేంజ్ హీరోలలో ఎవరికీ లేని విధంగా రెండు సార్లు వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలను అందుకొని తన సత్తా చాటాడు. ఇక నిన్న విడుదలైన ‘హిట్ 3′(Hit: The Third Case) మూవీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత, ఇక నాని మీడియం రేంజ్ హీరో కాదు, స్టార్ హీరో అని చెప్పేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజున అక్షరాలా 43 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ రేంజ్ లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఇప్పటి వరకు ఓపెనింగ్ రాలేదు. ఇక బుక్ మై షో లో ఈ సినిమాకు మొదటి రోజున అమ్ముడుపోయిన టికెట్స్ ని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 2 లక్షల 71 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రానికి మొదటి రోజు కేవలం 2 లక్షల 36 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. రెండు సినిమాలకు పబ్లిక్ టాక్ ఒక్కటే కాదు కానీ, ఒకవేళ టాక్ వచ్చినా కూడా ‘గుంటూరు కారం’ కి ‘హిట్ 3’ రేంజ్ ఉండేది కాదని అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ అంశంపై ట్రోల్స్ మామూలు రేంజ్ లో లేవు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మహేష్ బాబు రేంజ్ బాగా తగ్గిపోయిందా?, లేకపోతే నాని రేంజ్ పెరిగిందా అనే విషయం లో సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది. ఇక రెండవ రోజు ట్రెండింగ్ అయితే ‘హిట్ 3’ కి వేరే లెవెల్ లో ఉంది.
బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 14 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. శుక్రవారం రోజే ఈ రేంజ్ ట్రెండ్ ఉంటే, ఇక శని, ఆదివారాల్లో ఏ రేంజ్ ట్రెండ్ ఉంటుందో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల రూపాయలకు జరిగింది. స్పీడ్ చూస్తుంటే రేపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో పక్క ఈ సినిమా తో పాటు విడుదలైన సూర్య ‘రెట్రో’ మూవీ కలెక్షన్స్ రెండవ రోజు బాగా డౌన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 6 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ‘హిట్ 3’ లో సగం కూడా లేకపోవడం విశేషం.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?