Bullet Bhaskar : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth) అనే కామెడీ షో ఎంత మందికి జీవితాన్ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ద్వారా పరిచయమైనా కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో అత్యధిక శాతం టాప్ స్థానం లో కొనసాగుతున్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న అనసూయ కూడా ఈ షో ద్వారానే పాపులర్ అయ్యింది. అయితే కొంతమంది కమెడియన్స్ మాత్రం అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, ఏళ్ళ తరబడి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఇప్పటికీ జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar). రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read ; జబర్దస్త్ షోలో షాకింగ్ పరిణామం… బుల్లెట్ భాస్కర్ కి గుండు కొట్టించిన జడ్జెస్, కుష్బూ ఫైర్!
ఆయన మాట్లాడుతూ ‘జబర్దస్త్ నాకు జీవితాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞతతో, నాకు ఇతర చానెల్స్ లో గొప్ప ఆఫర్స్ వచ్చినప్పటికీ జబర్దస్త్ ని వీడకుండా కొనసాగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో మీతో పాటు పని చేసిన ఎంతో మంది ఇప్పుడు ఇండస్ట్రీ లోకి వచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు, కానీ మీరెందుకు ఆ వైపు అడుగులు వేయలేదు అని యాంకర్ అడగ్గా, దానికి భాస్కర్ సమాధానం చెప్తూ ‘ఇండస్ట్రీ లో ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు. గట్టిగా చెప్పాలంటే మన నీడని కూడా నమ్మలేము. నాకు నటుడిగా కంటే డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. ఒక పెద్ద సినిమాకు దర్శకత్వం వహించేంత సత్తా నాలో ఉంది. కానీ అవకాశాలు ఇవ్వలేదు. నేను చెప్పిన స్టోరీ లను విన్న కొంతమంది నిర్మాతలు, నా అనుమతి లేకుండా వాటిని వాడేశారు. వేరే దర్శకులతో తీసి హిట్ కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు భాస్కర్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి కలిసి పని చెయ్యాలి అనేది నా కోరిక. భవిష్యత్తులో ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈ బుల్లెట్ భాస్కర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో క్లిక్ అయిన ఎంతో మంది కమెడియన్స్ కంటే గొప్ప నటుడు. ఇతను కామెడీ అద్భుతంగా చేయగలడు, అదే సమయంలో ఎమోషన్స్ ని కూడా గొప్పగా పలికించగలడు. అంతే కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. మహేష్ బాబు వాయిస్ ని ఈయన రేంజ్ లో ఇండస్ట్రీ లో ఎవ్వరూ అనుకరించలేరు. 1 నేనొక్కడినే సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఈయన డబ్బింగ్ కూడా చెప్పాడు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఇంకా జబర్దస్త్ కి మాత్రమే పరిమితమైన బుల్లెట్ భాస్కర్ ని భవిష్యత్తులో అయినా గుర్తిస్తారో లేదో చూడాలి.
Also Read : అసలు సుధీర్ ఎవడు..? రష్మీ నా లవర్, బుల్లెట్ భాస్కర్ సీరియస్ కామెంట్స్!