Raghuvanshi: ఢిల్లీ జట్టుతో బుధవారం రాత్రి విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఆటగాడు సునీల్ నరైన్ పరుగుల వరద పారిస్తే..రఘు వన్షీ మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ లో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా..నరైన్ కు రఘు వంశీ జతయ్యాడు. ఏకంగా సునీల్ నరైన్ తో కలిసి రెండో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. అంతేకాదు 27 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్ లతో 54 పరుగులు చేశాడు.. దీంతో ఒకసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. ఇంతకీ ఎవరు ఈ రఘు వన్షీ ? ఏంటి అతని నేపథ్యం?
బుధవారం నాటి మ్యాచ్లో కోల్ కతా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభ ఓవర్ నుంచే కోల్ కతా డామినేషన్ మొదలుపెట్టింది. పిలిప్ సాల్ట్ 18 పరుగులకు అవుట్ అయినప్పటికీ.. సునీల్ నరైన్, రఘు వన్షీ జోడి మెరుపులు మెరిపించింది. ఢిల్లీ జట్టుకు భయాన్ని పరిచయం చేసింది. వీరిద్దరూ ప్రతి బౌలర్ ను చీల్చి చెండాడారు.. ఈ మ్యాచ్ ద్వారా రఘు వన్షీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఎంట్రీ మ్యాచ్లోనే ఆఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. 18 సంవత్సరాల రఘు వన్షీ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి దిగడమే కాదు.. పెను తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 2005 లో ఢిల్లీలో జన్మించిన రఘు వన్షీ.. 11 ఏళ్ల వయసులోనే అతని కుటుంబం ముంబైకి మకాం మార్చింది. అక్కడ అతడు తన నైపుణ్యానికి మెరుగులు అద్దుకున్నాడు.
2022 అండర్ 19 వరల్డ్ కప్ లో రఘు వన్షీ పేరు మార్మోగింది. ఆ టోర్నీలో అతడు 278 పరుగులు చేశాడు. అంతేకాదు టీమిండియా టైటిల్ దక్కించుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్ ఏ, టీ 20 లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీకే నాయుడు ట్రోఫీలో అదరగొట్టాడు. ఆ టోర్నీలో ఏకంగా 765 రన్స్ చేశాడు. అయితే దేశవాళీ వైట్ బాల్ క్రికెట్లో అతడు పెద్దగా రాణించలేదు. ఇక ఇతడిని కోల్ కతా కొనుగోలు చేయడం వెనక పెద్ద కథే ఉంది. రఘుకు చిన్నప్పటినుంచి కోచ్ గా అభిషేక్ నాయక్ వ్యవహరించేవాడు. అతడు ప్రస్తుతం కోల్ కతా జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉన్నాడు. అతడి తెరవెనక కృషి చేయడం వల్లే రఘుకు కోల్ కతా జట్టులో స్థానం లభించిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అతడు దక్కిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాడు..
రఘు వన్షీకి తమ్ముడు కృష్ణన్ ఉన్నాడు. అతడు టెన్నిస్ ఆటగాడు. అయితే కృష్ణన్ కు చిన్నప్పటి నుంచే క్యాన్సర్ బాధితుడు. కృష్ణన్ అంటే రఘు వన్షీ కి విపరీతమైన ప్రేమ. కృష్ణన్ క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ఆసుపత్రిలో చికిత్స పొందేవాడు. అలా తమ్ముడి కోసం రఘు వన్షీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. మానసిక ఎదను అనుభవించాడు. కృష్ణ పొందిన చికిత్స కూడా రఘు వన్షీని మానసికంగా బలోపేతం చేసింది. కాగా అతని ఫ్లాష్ బ్యాక్ బాధాకరంగా ఉండడంతో.. అభిమానులు రఘు వన్షీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టులో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.