Yoga Asanas: ఆరోగ్యమే మహాభాగ్యం. ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతనే. లేదంటే ఆ ఆరోగ్యం మనతో ఆడుకుంటుంది. ఈ బిజీ లైఫ్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉదయం లేచిన తర్వాత కాస్త వాకింగ్, వ్యాయామం వంటివి చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచి హెల్దీగా ఉంటారు. మరి పెద్దల గురించి వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఆసనాలు వారిని యంగ్ గా చేస్తాయి కూడా. మరి సులువైన ఆ ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తడాసన.. మౌంటైన్ పోజ్ అనే ఈ ఆసనాను ప్రతిరోజు అలవాటు చేసుకుంటే నడుమును సాగదీస్తుంటుంది. శరీరంలో స్థిరత్వం, రక్తంలో సమతుల్యతను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ ఆసన. అంతేకాదు అరికాళ్లల్లో బలాన్ని కూడా చేకూరుస్తుంది.
ఉత్కటాసన.. కుర్చీ భంగిమ అనే ఈ ఆసన శరీరంలోని పాదం, నడుమ జాయింట్లు, పిక్కలు, భుజాలు వంటి అవయవాలకు బలాన్ని అందిస్తుంది. కాళ్లల్లో మృదుత్వం, స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది ఈ ఆసన. .
వృక్షాసన.. ఈ ఆసనాను చెట్టు భంగిమ అంటారు. కాలి కండరాలకు అధిక వ్యాయామం కలిగిలా చేస్తూ సయాటికా నరాల సమస్యలను పూర్తిగా దూరం చేయడంలో సహాయం చేస్తోంది. మనిషిలో చైతన్యం, ఏకాగ్రతను కూడా పెంచుతుంది ఈ ఆసన.
పశ్చిమోత్తాసనం.. కూర్చున్న ఫార్వర్డ్ బెండ్ ఆసనా అంటారు. దీని వల్ల పొట్టలోని కండరాలు, జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడంలో సహాయపడుతుంది.
మార్జర్యాసన.. ఈ ఆసనాను పిల్లి-ఆవు స్ట్రెచ్ అని పిలుస్తుంటారు. వెన్నెముక భాగంలో రక్త ప్రసరణను పెంచడమే కాకుండా మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెదడులోని నాడుల్లో ఉద్రిక్తతను తగ్గిస్తుంది కూడా.
కరణి ఆసనం.. దీన్ని లెగ్స్-అప్-ది-వాల్ పోజ్ అంటారు. దీని వల్ల శరీరంలో అలసట తగ్గి విశ్రాంతిగా అనిపిస్తుంది.