IND VS BAN : విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులు విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ వైపు గా వెళ్తున్న బంతిని అనవసరంగా టచ్ చేసి కీపర్ దాస్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. వాస్తవానికి విరాట్ ఔట్ అయ్యాడనేకంటే.. చేజేతులా వికెట్ పారేసుకున్నాడనడం సబబు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో పాటు తన నిర్లక్ష్యం వల్ల విరాట్ కోహ్లీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన విధానానికి సంబంధించి రిప్లై చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ లో తన స్పందనను తెలియజేశాడు. ” బ్యాట్ కు బంతి తగిలింది కూడా విరాట్ కు అర్థం కావడం లేదా?” అంటూ రోహిత్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తప్పుడు నిర్ణయాన్ని వెల్లడించిన అంపైర్ రిచర్డ్ కేటల్ బరో.. ఆ తర్వాత రిప్లై చూసి జీవం లేని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
టీమిండియా రెండవ ఎండింగ్ సమయంలో బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మిరాజ్ 20 ఓవర్ బౌలింగ్ వేశాడు.. సందర్భంగా విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. మిరాజ్ రెండవ బంతిని స్టంప్స్ లక్ష్యంగా వేశాడు.. ఆ బంతిని కోహ్లీ ప్లిక్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్ లను తగిలింది. దీంతో హసన్ అంపైర్ కు అప్పీల్ చేశాడు. మరో మాటకు తావు లేకుండా అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకోవాలని గిల్ ఎండ్ లో సూచించినప్పటికీ కోహ్లీ వినిపించుకోలేదు.. రిప్లై లో మాత్రం బంతి బ్యాట్ ను తగిలినట్టు కనిపించింది.. ఈ వీడియోని చూసిన అనంతరం రోహిత్ శర్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విరాట్ తీరుపై మండిపడ్డాడు. ” బంతి ఎటువైపుగా వస్తోంది. బ్యాట్ తగిలిందా? లేదా? అనే అవగాహన ఆటగాడికి ఉండాలి..బంతి బ్యాట్ కు తగిలినట్టు కూడా విరాట్ కు తెలియదా? మరీ ఈ స్థాయిలో ఆడితే ఎలా? కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలి కదా? అనవసరంగా వికెట్ పోయింది.. కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా చేయడం సరికాదు. అతడు గనుక క్రీజ్ లో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని” వ్యాఖ్యానించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తన నిర్లక్ష్యం వల్ల వికెట్ పారేసుకోవడం పట్ల మరో ఎండ్ లో ఉన్న గిల్ కూడా బాధపడ్డాడు..అయ్యో అనవసరంగా వికెట్ పోయిందని కలత చెందాడు.
Rohit Sharma and Kettleborough's reaction to Virat Kohli not reviewing even after the edge. pic.twitter.com/O9tK060MyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024