Travis Head: 2023లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆధ్వర్యంలో టీం ఇండియా ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక అదే సంవత్సరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు భారత్ వెళ్ళింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికా పై గెలిచింది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టి20 వరల్డ్ కప్ సాధించింది. 2025 లో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగినప్పుడు.. న్యూజిలాండ్ జట్టు పై భారత్ విజయం సాధించి.. 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఐసీసీ నిర్వహించిన నాలుగు మెగా టోర్నీలలో ఫైనల్ వెళితే.. రెండుసార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది.. అయితే అన్ని సందర్భాల్లో జట్టును రోహిత్ ముందుకు నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో రోహిత్ విజయవంతమైన కెప్టెన్ గా మన్ననలు అందుకున్నాడు.
Also Read: ఇంగ్లాండ్ టూర్ కు ముందు గంభీర్ కీలక నిర్ణయం.. తెలుగోడికి ఉద్వాసన
అతడిని చూసి స్ఫూర్తి పొందాను..
రోహిత్ విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకుమించిన ఆటగాడు కూడా. అందువల్లే అతడికి విపరితమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో, మీడియాలో అతని గురించి చర్చ సాగుతూనే ఉంటుంది. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న హెడ్ రోహిత్ శర్మ గురించి తన మనసులో ఉన్న మాటలను చెప్పాడు.. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో హెడ్ రోహిత్ శర్మ పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. “రోహిత్ ను చూసే నేను చాలా నేర్చుకున్నాను. అక్కడి నుంచి నేను ప్రేరణ పొందాను.. నేను ఎక్కువ సమయం అతడితో గడపలేదు.. కానీ అతడు జట్టును నడిపిస్తున్న విధానం.. ఆడుతున్న విధానం.. నాకు బాగా నచ్చింది.. కెప్టెన్ గానే కాకుండా.. ఓపెనింగ్ బ్యాటర్ గా కూడా అతడు అద్భుతమైన ప్రతిభ చూపాడు. జట్టుపై చెరగని ముద్ర వేశాడు. అతడు నెలకొల్పిన స్ఫూర్తి చాలా మందిలో అలాగే ఉంది.. దూకుడు తో పాటు సమయమనం కూడా అతనిలో ఉంది. ఇన్ని పార్శ్వాలు అతనిలో ఉన్నాయి కాబట్టి.. నేను వాటిని చూసి ఆనందించాను. కొన్ని సందర్భాల్లో అనుసరిస్తున్నాను.. బహుశా భవిష్యత్తు కాలంలో రోహిత్ లాగా నేను కూడా అలాంటి లక్షణాలలో క్రికెట్లో అలవర్చుకోవాలని భావిస్తున్నానని” హెడ్ వ్యాఖ్యానించాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలు రోహిత్ శర్మ అభిమానులకు తెగ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ హెడ్ రోహిత్ గురించి అనేక సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడాడు. తన మదిలో ఉన్న భావాలను వ్యక్తం చేశాడు.. రోహిత్ మంచి ఆటగాడు అంటూ కితాబిచ్చాడు.
HEAD ROHIT….!!!!
– Travis Head talks about the Greatness of Indian Captain Rohit Sharma pic.twitter.com/bfEYFnTJmD
— Johns. (@CricCrazyJohns) April 17, 2025