IND Vs ENG: ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటన ద్వారానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ మొదలవుతుంది.. ఈ క్రమంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన స్టాఫ్ లో ముఖ్య భాగంగా ఉన్న అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్, తెలుగు వ్యక్తి దిలీప్ కు ఉద్వాసన పలకడానికి గౌతమ్ గంభీర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది..కోచ్ ల సంఖ్య అధికంగా ఉండడంవల్లే బీసీసీఐ ఈ ప్రతిపాదనను గౌతమ్ గంభీర్ ఎదుట ఉంచినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇక ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ గా సీతాన్ష్ కోటక్ ఉన్నాడు. అందువల్లే అభిషేక్ నాయర్ అవసరం లేదని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్ వైఫల్యం భారత జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.ఫలితంగా సిరీస్ ను 1-3 తేడాతో భారత్ కోల్పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నాయర్ వ్యవహరించాడు. అతడికి ఉద్వాసన పలకాలని బీసీసీఐ భావిస్తోంది.. ఇక ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్లేస్ లో మరో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కటే ను తీసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: సూపర్ ఓవర్ టై అయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు?
నోరు మెదపని బిసిసిఐ
కోచ్ లు, ఇతర సిబ్బంది మార్పుపై ఇంతవరకు బీసీసీఐ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా, 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు భారత జట్టుకు కోచ్ గా రాహు ద్రావిడ్ ఉన్నాడు. ఆ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక అతడి తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చాడు. సహాయక సిబ్బంది విషయంలో బీసీసీఐ గౌతమ్ గంభీర్ కు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చింది.. దీంతో గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు మెంటార్ గా ఉన్నప్పుడు తనతో పాటు కలిసి పని చేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నీ మోర్కెల్ ను సహాయక సిబ్బంది గా తీసుకున్నాడు.. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ను కొనసాగించాడు.. అయితే గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మాట్ లో భారత దారుణమైన ఓటములను సొంతం చేసుకుంది. స్వదేశంలో కివీస్ పై మూడు టెస్టుల సిరీస్ కోల్పోయింది. ఇక శ్రీలంక దేశంలో జరిగిన వన్డే సిరీస్ లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నష్టపోయింది. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. దీంతో గౌతమ్ గంభీర్ మీద ఉన్న ఒత్తిడి కాస్త తగ్గింది. అయితే కోచింగ్ స్టాఫ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యను కుదించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు దిలీప్ ఆధ్వర్యంలో టీమిండియా ఫీల్డింగ్ గతంతో పోల్చి చూసుకుంటే మెరుగైంది. అయితే అతడిని ఆ స్థానం నుంచి ఎందుకు తప్పిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఐపీఎల్ పూర్తికాగానే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ జట్టుతో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది.