Free Computer Training: ఈ క్రమంలో వాళ్లకు కంప్యూటర్ పై అవగాహన కూడా ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ వారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లో పూలబాగ్ రోడ్డు వెంకటకృష్ణ థియేటర్ ఎదురుగా ఇవ్వబడుతుంది. మీరు ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణలో ఎంఎస్ ఆఫీసు, టాలీ, డిటిపి, సి సి ప్లస్ ప్లస్ 45 రోజులు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అయితే ఈ ఉచిత శిక్షణకు పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల నుంచి పీజీ చదివిన విద్యార్థుల వరకు అర్హులు అంటూ తెలియజేశారు. ఈ ఉచిత శిక్షణ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ 45 రోజుల ఉచిత శిక్షణకు ఎటువంటి అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఒక పూట థియరీ క్లాస్ అలాగే మరొక పూట ప్రాక్టికల్ క్లాసు ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. చాలా అనుభవం ఉన్న ఫ్యాకల్టీ తో ఈ శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నారు.
Also Read: తిరుపతిలో హై టెన్షన్.. గోశాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు.. బయలుదేరిన కరుణాకర్ రెడ్డి!
ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ ఇన్స్టిట్యూట్ కు వచ్చి తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా ఈ ఉచిత శిక్షణ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులకు ఎంఎస్ ఆఫీసు, డిటిపి, టాలీ, సీసీ ప్లస్ ప్లస్ వంటి పలు రకాల కోర్సులలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తి అయిన తర్వాత వాళ్లకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి సర్టిఫికెట్ కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అయితే ఈ ఉచిత శిక్షణ కంప్యూటర్ ట్రైనింగ్ కు పేరు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎటువంటి ధ్రువపత్రాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యార్థుల సంబంధిత సర్టిఫికెట్ మార్కు లిస్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ లో సర్టిఫికెట్ ఉంటుందని అలాగే ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలు కూడా నేర్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కోర్సు పూర్తయిన తర్వాత వాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికెట్ వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది అంటే నిర్వాహకులు తెలియజేశారు.