Pushpa 2: The Rule : దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేనియా నే కనిపిస్తుంది. బహుశా అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఈ చిత్రానికి ఇంత క్రేజ్ ఉంటుందని ఊహించి ఉండరు. అంతే కాదు మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఈ సినిమాకి ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండరు. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 284 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి కి తప్ప మరొకరికి ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తుందని మనం అనుకోలేదు. #RRR చిత్రానికి 240 కోట్ల రూపాయిల గ్రాస్ మొదటి రోజు వస్తే, ఈ చిత్రానికి దానికంటే అదనంగా మరో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం మొదటిరోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అలా రెండు రోజుల్లో 420 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ట్రేడ్ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఆ స్థాయిలో ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ట్రెండ్ నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం హాలీవుడ్ తో కలిపి వరల్డ్ వైడ్ గా నడుస్తున్న అన్ని చిత్రాలకంటే ‘పుష్ప 2’ కే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. దరిదాపుల్లో మరో సినిమా లేదు. హాలీవుడ్ లో ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న సినిమాలకు కూడా ‘పుష్ప 2’ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం లేదు. ఈ విధంగా వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న ‘పుష్ప 2’ చిత్రాన్ని ప్రపంచ రికార్డు సృష్టించిన చిత్రంగా వర్ణిస్తున్నారు ట్రేడ్ పండితులు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కి వీకెండ్ లో 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. #RRR చిత్రానికి కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. ఊపు చూస్తుంటే మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది. హాలీవుడ్ సినిమాలకు తప్ప, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా ఇలాంటి వసూళ్లు మొదటి వారం లో రాలేదు. ఆ ఘనత కూడా పుష్ప 2 చిత్రానికే దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ కారణంగా కాస్త వసూళ్లు తగ్గిన విషయం వాస్తవమే. కానీ 10 రోజుల తర్వాత టికెట్ రేట్స్ ఎలాగో తగ్గుతాయి. టికెట్ రేట్స్ తగ్గినప్పుడు ‘దేవర’ చిత్రానికి ఎలా అయితే లాంగ్ రన్ వచ్చిందో, ఈ సినిమాకి కూడా అలాంటి లాంగ్ రన్ వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.