India Vs Australia World Cup Final 2023: 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీంల మధ్యన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అయితే మొదట బ్యాటింగ్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా మాత్రం బౌలింగ్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మ్యాచ్ కి ముందు అందరూ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకుంటుంది ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కాబోతుందని చాలా రకాల వ్యాఖ్యలు చేశారు.
కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన పాట్ కమ్మిన్స్ మాత్రం దానికి వ్యతిరేకంగా అనూహ్య నిర్ణయం తీసుకొని టాస్ గెలిచిన కూడా బౌలింగ్ తీసుకొని ఇండియన్ టీం ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. కమ్మిన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అని చాలామంది ఆరా తీస్తున్నారు.ఇక కమ్మిన్స్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది పక్కన పెడితే ఇండియన్ టీం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలనుకుంది కాబట్టి మన టీమ్ టాస్ ఓడిపోయిన కూడా మనకు బ్యాటింగ్ వచ్చిందనే ఉద్దేశ్యం లో ఇండియన్ టీం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.ఇక మొదట బ్యాటింగ్ కి రావడం తో ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో సగం సక్సెస్ అయిందంటూ భారీ ఎత్తున సోషల్ మీడియాలో పోస్టు లు వైరల్ అవుతున్నాయి…
నిజానికి ఇక్కడ మొదట బ్యాటింగ్ తీసుకున్న, సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న పెద్దగా పోయేదేంలేదనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ మొదటి బ్యాటింగ్ కి, రెండోవ బ్యాటింగ్ కి రెండింటికి ఒకే రకంగా అనుకూలిస్తుంది. కానీ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్లకి ఫైనల్ మ్యాచ్ కాబట్టి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది.దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఆ ప్లేయర్ మీద మ్యాచ్ కండిషన్ మీద అప్పుడున్న సిచువేషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం చేజింగ్ లో అదరగొడుతుంది కాబట్టి పాట్ కమ్మిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది… ఇలా చేస్తే ఇండియా మొదట ఎంత కొడుతుందో ఒక అంచనా ఉంటుంది.
కాబట్టి దాన్ని బట్టి వాళ్లు నెక్స్ట్ ఆ స్కోర్ ని చేజ్ చేయవచ్చు అనే ఉద్దేశ్యం లో కమ్మిన్స్ ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలుస్తుంది.ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎంత పెద్ద టీం అయినా ఎన్నిసార్లు నాకౌట్ మ్యాచ్ లు ఆడినా కూడా ఫైనల్ మ్యాచ్ అంటే మాత్రం తప్పకుండా ప్రెజర్ అనేది ఉంటుంది దాన్ని కాలిక్యులేట్ చేయడంలో పాట్ కమ్మిన్స్ చాలావరకు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనే చెప్పాలి. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఇండియాకి అనుకూలంగా రావడం అనేది ఒక వంతుకు ఇండియన్ టీం అదృష్టమనే చెప్పాలి…