Mangalavaram Collections: దర్శకుడు అజయ్ భూపతి-పాయల్ రాజ్ పుత్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఓ ఐదేళ్ల క్రితం విడుదలైన ఆర్ ఎక్స్ 100 ఓ సంచలనం. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100లో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అజయ్ భూపతి పాయల్ తో మరోసారి ఇదే తరహా ప్రయోగం చేశాడు. పీరియాడిక్ సస్పెన్స్ క్రైమ్ విలేజ్ డ్రామా తెరకెక్కించాడు. అతి శృంగారం అనే డిజాస్టర్ ని టచ్ చేశాడు. మంగళవారం మూవీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమాలో విషయం ఉందని నమ్మించిన అజయ్ భూపతి సినిమాకు మంచి మార్కెట్ తెచ్చిపెట్టాడు. పాయల్ వంటి ఫార్మ్ లో లేని హీరోయిన్ ప్రధానంగా తెరకెక్కిన మంగళవారం రికార్డు బిజినెస్ చేసింది. నైజాంలో మంగళవారం రూ.3.20 కోట్ల థియేట్రికల్ హక్కులు అమ్మారు. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలు కలుపుకుని రూ. 7 కోట్లకు అమ్మారు. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్ సీస్ హక్కులు మరో రూ. 2 కోట్లు పలికినట్లు సంచరం. ఇలా వరల్డ్ వైడ్ మంగళవారం రూ.12.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మంగళవారం సినిమాకు మొదటి రోజు అంచనాకు మించి ఆదరణ దక్కింది. ఫస్ట్ డే మంగళవారం రూ.2.44 కోట్ల షేర్, 4.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే సెకండ్ డే వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. శనివారం తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం మూవీ రూ. 80 లక్షల షేర్ రాబట్టిందట. వరల్డ్ వైడ్ రూ.1 కోటి రూపాయల షేర్ అందుకుందట.
రెండు రోజులకు మంగళవారం రూ. 3.44 కోట్ల షేర్ రాబట్టింది. అయితే టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న మంగళవారం ఇంకా మెరుగైన వసూళ్లు రాబట్టాల్సింది. మంగళవారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13 కోట్లుగా ఉంది. ఆదివారం ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టాలి. లేదంటే బ్రేక్ ఈవెన్ కష్టమే. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. మరి పాయల్ రాజ్ పుత్ ఈ మేరకు ప్రేక్షకులను థియేటర్స్ కి రాబడుతుందో చూడాలి.