https://oktelugu.com/

IND VS END T20 Series : సీనియర్ల, జూనియర్ల కలయిక.. ఇంగ్లాండ్ తో టీ -20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్(border Gavaskar trophy) ని టీం ఇండియా (team India) 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే టోర్నీల విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 12, 2025 / 08:11 AM IST

    IND VS END T20 Series Indian Team

    Follow us on

    IND VS END T20 Series : మరి కొద్ది రోజుల్లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో (England cricket board) స్వదేశంలో t20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ (BCCI selection committee) జట్టును ప్రకటించింది. జట్టు సారధిగా సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav)ను నియమించింది. టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియాకు టి20 లలో సూర్య కుమార్ యాదవ్ సారధిగా ఉన్నాడు. ఇక తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ (Tilak Verma), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి చోటు లభించింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) దృవ్ జురెల్(Dhruv jural), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్(Akshar Patel), అర్ష్ దీప్ సింగ్ (arsh deep Singh), హర్షిత్ రాణా (Harshit Rana), రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), వరుణ్(Varun), వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar), రింకూ సింగ్( Rinku Singh) , సంజు సాంసన్(Sanju Samson), మహమ్మద్ షమీ (Mohammed Shami) వంటి వారిని ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

    సీనియర్ల, జూనియర్ల కలయిక

    భారత మేనేజ్మెంట్ ఎంపిక చేసిన జట్టు సీనియర్లు, జూనియర్ల కలయికతో కళకళలాడుతోంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్, సంజు సాంసంన్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు కూడా జట్టులో ఉండటం విశేషం. అయితే గత సిరీస్ ల మాదిరిగా మేనేజ్మెంట్ ఈసారి కూడా ప్రయోగాల జోలికి వెళ్ళింది. గతంలో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో.. ఈసారి కూడా అదే దారి ఎంచుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా పూర్తిగా యువ ఆటగాళ్ళను ఎంపిక చేయడంతో.. ఈసారి రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 22 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. ఐదు టి20 లు ఇంగ్లాండ్, భారత్ ఆడతాయి. తొలి మ్యాచ్ కోల్ కతా వేదికగా జరుగుతుంది.

    జట్టు ఇదే
    సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav),
    తిలక్ వర్మ (Tilak Verma), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), అభిషేక్ శర్మ (Abhishek Sharma) దృవ్ జురెల్(Dhruv jural), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్(Akshar Patel), అర్ష్ దీప్ సింగ్ (arsh deep Singh), హర్షిత్ రాణా (Harshit Rana), రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), వరుణ్(Varun), వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar), రింకూ సింగ్( Rinku Singh) , సంజు సాంసన్(Sanju Samson), మహమ్మద్ షమీ (Mohammed Shami).