Horoscope Today: తెలుగు పంచాంగం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఇన్ని రోజులు అనుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువ.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాజకీయ రంగాల వారికి అనుకూల వాతావరణం. ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. లాభాల కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సామాజిక సేవా రంగాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే పెద్దలతో చర్చిస్తారు. ఏ పని చేసినా అపారమైన లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వివాహానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనలు వస్తాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి స్నేహితుల సాయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఉద్యోగులు సీనియర్ల సలహాలు పాటిస్తారు. ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కుటుంబంతో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త ఆదాయంపై భాగస్వాములతో చర్చిస్తారు. ఎవరితోనూ ఎక్కువగా వాదించకుండా జాగ్రత్త పడాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులు కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. పిల్లలతో సరదాగా ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. వివాహానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి .
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. సంబంధాల్లో చీలకలు ఉంటాయి. వ్యాపారులు కొన్ని ప్రణాళికలు వేస్తారు. దీంతో ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. వాహనం లేదా భవనం కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు. ఇది లాభిస్తుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.