https://oktelugu.com/

Dil Raju : తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న దిల్ రాజు..వైరల్ అవుతున్న వీడియో..అసలు ఏమైందంటే!

ఇప్పుడు రెండవసారి కూడా ఆయనే ఈ ప్రాంతం లో ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో దావత్ కి సంబంధించి దిల్ రాజు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 08:15 AM IST

    Dil Raju apologizing to Telangana People

    Follow us on

    Dil Raju : ఈ సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మాణం నుండి విడుదలైన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దిల్ రాజు తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ ప్రాంతం లో నిర్వహించాడు. నిజామాబాద్ దిల్ రాజు పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడే గతంలో ఆయన ఫిదా సినిమా సక్సెస్ మీట్ ని కూడా చేసాడు. టాలీవుడ్ అప్పటి వరకు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి ఈవెంట్ ని నిర్వహించలేదు. ఇప్పుడు రెండవసారి కూడా ఆయనే ఈ ప్రాంతం లో ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో దావత్ కి సంబంధించి దిల్ రాజు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

    ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే విజయవాడ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్ చేయడం జరిగింది. నిజామాబాద్ లో మామూలుగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగలేదు. అప్పట్లో ఫిదా మూవీ సక్సెస్ మీట్ ఒక్కటి పెట్టాము, ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్ చేసాము. నిజామాబాద్ జిల్లా వాసిగా, ఆ ప్రాంతంతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆ ఈవెంట్ లో నేను తెలంగాణ కల్చర్ లోని దావత్ గురించి మటన్, తెలగలు గురించి సంభోదించాను. ఆ మాటలలో నేను తెలంగాణ సంస్కృతి ని అవమానించానని, తెలంగాణ ప్రజలను హేళన చేసానని కొంతమంది మిత్రులు సోషల్ మీడియా లో పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. నా ఉద్దేశ్యం అది కాదు, అదే స్పీచ్ లో నేను దావత్ ఈమధ్య మిస్ అవుతున్నాను అని చెప్పాను. దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఒక తెలంగాణ వాసిగా నేను తెలంగాణ సంస్కృతిని ప్రపంచం మొత్తం తెలిసేలా సినిమాలు చేశాను.

    ఫిదా చిత్రంలో భానుమతి క్యారక్టర్ ద్వారా తెలంగాణ యాస, తెలంగాణ అందాలను చూపించాము. అదే విధంగా బలగం అనే చిత్రం చేసి తెలంగాణ గ్రామాల్లో ఉండే సెంటిమెంట్ ని ప్రపంచం మొత్తానికి చూపించాము. ఈ సినిమా చేసినందుకు నన్ను ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. ఎన్నో సన్మానాలు కూడా చేసారు. తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని అందరికీ పరిచయం చేయాలి అని తపన పడే నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను తెలంగాణ ప్రభుత్వం తరుపున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. కేవలం సినిమాకి సంబంధించిన పనులు మాత్రమే చేస్తాను. నన్ను మీ రాజకీయాలకు వాడుకోవద్దు. మొన్న నేను తెలంగాణ సంస్కృతి ని అవమానించినట్టు మీకు అనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.