spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party 12 Years Journey: పవన్ నయా రాజకీయం.. జనసేనకు పుష్కరకాలం

Janasena Party 12 Years Journey: పవన్ నయా రాజకీయం.. జనసేనకు పుష్కరకాలం

Janasena Party 12 Years Journey: జనసేన.. ఆ మాటలోనే ఒక వైబ్రేషన్ ఉంది. జనసేన( janasena ) ఒక పార్టీ ఎటువంటి అపజయాలు ఎదుర్కోవాలో చవిచూసింది. వాటి నుంచి గుణపాఠాలు ఎలా నేర్చుకోవాలో చెప్పింది. విజయాన్ని ఎలా అందుకోవాలన్న విషయాన్ని చాటి చెప్పింది. దారుణ పరాజయం, ఎన్నెన్నో అవమానాలు తట్టుకొని ఆ పార్టీ నిలబడిన తీరు అభినందనీయమే. అయితే పుష్కర కాలంలో ఆ పార్టీ కి ఎదురైన పరిణామాలు.. కొత్త రాజకీయ పార్టీలకు ఒక మార్గం. 2014 మార్చి 14న హైదరాబాదులోని హెచ్ఐసీసీ వేదికగా కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కేవలం అధికార కోసం కాదు.. సమాజంలో మార్పు కోసమే అని పవన్ కళ్యాణ్ సగర్వంగా ప్రకటించారు. ప్రశ్నించే గొంతు గా ఆవిర్భవించిన జనసేన ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఎదిగిన తీరు మాత్రం అభినందనీయం. ఆదర్శనీయం.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

* ప్రజల కోసం ప్రశ్నించే గొంతు..
ఏదైనా రాజకీయ పార్టీ అధికారమే పరమావధి అని చెబుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan) మాత్రం ప్రజల కోసం ప్రశ్నించే గొంతు గా మారుతానని చెప్పుకొచ్చారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోటీకి దూరంగా ఉండి.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో పోటీకి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్. డిజాస్టర్ ఫలితాలు, రెండు చోట్ల ఓటమి తో కృంగిపోలేదు. ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా పదేళ్లపాటు ఓర్పుతో, నిలకడతో పార్టీని నిర్మించిన తీరు నేటి రాజకీయాల్లో ఒక అద్భుతం అనే చెప్పాలి. తన శక్తి యుక్తులను పార్టీ కోసం ఉపయోగించి.. అవమానాలను తట్టుకొని.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నిలబడిన తీరు మాత్రం మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శం.

* ఏడు విధానాలతో
సాధారణంగా రాజకీయ పార్టీలు అంటే భిన్న వైఖరి ఉంటుంది. ఎప్పటికప్పుడు భావజాలం మారుతూ ఉంటుంది. కానీ జనసేన మాత్రం స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలు ఆ పార్టీకి మార్గదర్శకాలుగా మారాయి. 1. కులాలను కలిపే ఆలోచన విధానం 2, మతాల మధ్య వైశ్యం లేని రాజకీయం 3, భాషా వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం 4, మన సంస్కృతిని కాపాడే సమాజం 5, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించని జాతీయవాదం 6, అవినీతిపై రాజీలేని పోరాటం 7, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి.. ఇదే జనసేన భావజాలాన్ని తెలిపే గొప్ప మార్గదర్శకాలు. పవన్ కళ్యాణ్ లో గొప్ప జాతీయవాదం ఉంటుంది. మనుషులంతా ఒక్కటే అనే మానవతావాదమే తన సిద్ధాంతమని గట్టిగా నమ్ముతారు పవన్ కళ్యాణ్.

* మనుగడ సాధించి..
ఒక ప్రాంతీయ పార్టీ( regional party మనుగడ చాలా కష్టం. అటువంటిది పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండడం కూడా చాలా కష్టం. అయితే జనసేన ఓటమితోనే మొదలయింది. నిత్యం ఓటములు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా సరే వెన్ను చూపలేదు. తనకెందుకు ఈ గొడవ అంటూ తిరిగి సినిమా లోకంలోకి వెళ్లిపోలేదు. ఒకప్పుడు కేవలం ఒక సినీ నటుడిగా చూసిన వారే పవన్ కళ్యాణ్ ను ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఒప్పుకొని గౌరవిస్తున్నారు. ఆయన సినిమాలో డైలాగ్ మాదిరిగానే ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా ఆయనకు తెలుసు. పొత్తులు ఎందుకు అన్నారు. ఒంటరిగా పోరాటం చెయ్ అన్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అవేవీ కుదరకపోయేసరికి సొంత వారితో పొత్తు లేకుండా చూడాలని చూసారు. వాటిని గ్రహించి పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. ఓట్లు చీలకుండా కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయన వహించిన పాత్ర అసాధారణం. తన పార్టీకి లభించిన శత శాతం విజయంతో ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా ఆకర్షించగలిగారు పవన్ కళ్యాణ్. రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు సహజం. కానీ జనసేన మాత్రం అన్నింటికీ ఆరితేరిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version