Homeక్రీడలుక్రికెట్‌World Cricket : నయా క్రికెట్ లో ఈ కుర్ర "బ్యాట్ వీరులు".. కోహ్లీ, కేన్,...

World Cricket : నయా క్రికెట్ లో ఈ కుర్ర “బ్యాట్ వీరులు”.. కోహ్లీ, కేన్, స్మిత్, రూట్ కు సరైన వారసులు

World Cricket :  కేన్ విలియంసన్, స్మిత్, రూట్, కోహ్లీ టెస్ట్ క్రికెట్లో మరో రెండు సంవత్సరాలు పాటు ఆడే అవకాశం కల్పిస్తోంది. ఎరుపు బంతి క్రికెట్లో రూట్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. స్థూలంగా చెప్పాలంటే వారి బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ రావడం లేదు. దీంతో ఇన్నాళ్లపాటు వారి వీరోచిత క్రికెట్ వీక్షించిన ప్రేక్షకులు.. సరికొత్త యోధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతటి సంధి కాలంలో సరికొత్త యోధులుగా.. ఆ నలుగురికి వారసులుగా కుర్రాళ్ళు ముందుకు వచ్చారు. విరాట్ కోహ్లీకి, కేన్ విలియమ్సన్ కు, స్మిత్ కు, రూట్ కు ఏమాత్రం తగ్గకుండా ఆడుతున్నారు. భవిష్యత్తు ఆశాకిరణాలుగా వెలుగొందుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరంటే.
యశస్వి జైస్వాల్ 
” వామ్మో అతడు ఆడుతుంటే భయం వేస్తోంది. ఇంత చిన్న వయసులో అంత కసా.. బంతితో అతడికి శత్రుత్వం ఉన్నట్టుంది. బౌలర్ తో గెట్టు పంచాయితీ ఉన్నట్టుంది. అందువల్లే అలా ఆడుతున్నాడు” టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ గురించి వెస్టిండీస్ ఆటగాడు లారా చేసిన వ్యాఖ్యలు అవి. అతడు చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే నయా ఫ్యాబ్ -4 లో యశస్వి జైస్వాల్ భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసేలా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ స్థాయిలోనే బ్యాటింగ్ చేస్తూ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. 22 సంవత్సరాల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 11 టెస్టులు మాత్రమే ఆడాడు. 1,217 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. రెండు డబుల్ సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు సులువుగా కొట్టేశాడు. తనది కాని రోజు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగల నైపుణ్యం జైస్వాల్ సొంతం. బౌండరీలను సులువుగా కొట్టగలడు. సిక్సర్ లను నేర్పుగా బాదగలడు.
కామిందు మెండీస్ 
స్టార్ ఆటగాళ్లు విశ్రాంతి ప్రకటించారు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఫలితంగా శ్రీలంక జట్టు కీర్తి పడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక జట్టుకు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు కామిందు మెండిస్ వచ్చాడు. ఎంట్రీ లెవెల్ లోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడటం మొదలుపెట్టాడు. 26 సంవత్సరాల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడింది ఇప్పటివరకు 9 టెస్టులు మాత్రమే. ఏకంగా 1055 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో కనీసం 50కి పైగా స్కోరు సాధిస్తున్నాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు ఆఫ్ బ్రేక్ స్పిన్ కూడా వేయగలడు. బంతులను ముత్తయ్య మురళీధరన్ లాగా మెలికలు తిప్పగలడు.
రచిన్ రవీంద్ర 
కేన్ విలియం సన్ వారసుడిగా రచిన్ రవీంద్ర  వినతికెక్కాడు. ఇతడి తల్లిదండ్రులకు భారతీయ మూలాలు ఉన్నాయి. రచిన్ రవీంద్ర కు 24 సంవత్సరాలు. అతడు ఎంతో బాధ్యతాయుతంగా క్రికెట్ ఆడుతున్నాడు. పరిస్థితిని బట్టి గేర్ మార్చుతున్నాడు. సహచరుడు వెంట వెంటనే అవుట్ అవుతున్నప్పటికీ.. క్రీజ్ లో అలానే ఉంటున్నాడు. 10 టెస్టులు ఆడి 672 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక డబ్బు సెంచరీ ఉన్నాయి. పై ఆటగాళ్లతో పోల్చి చూస్తే రచిన్ తక్కువగానే ఆడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో రాటుదేలే అవకాశం ఉంది.
బ్రూక్
రూట్ వారసుడని బ్రూక్ ను ఇంగ్లాండ్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు. 25 సంవత్సరాల ఈ ఆటగాడు విధ్వంసకరమైన ఆటకు పెట్టింది పేరు. 18 టెస్టులలో 62+ సగటుతో 1875 రన్స్ చేశాడు. పాకిస్తాన్ జట్టుపై త్రి శతకం బాదాడు. ఇప్పటివరకు 5 టెస్ట్ సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. నిలకడగా ఆడుతూ.. మైదానంలో ప్రత్యర్థి ఇచ్చట్లకు కొరకరాని కొయ్యలాగా మారుతున్నాడు.
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version