Rana Daggubati : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఎంట్రీ ఇచ్చినా హీరోగా అవతారం ఎత్తిన ఇరగదీస్తుంటాడు ఈ టాలీవుడ్ హీరో. ఈయన సినిమా వస్తుందంటే అభిమానులు విజిల్స్ వేస్తుంటారు కూడా. గత కొన్ని సంవత్సరాల క్రితం లీడర్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో సూపర్ డూపర్ అనిపించాడు. ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ స్టార్ హీరో. అంతేనా ది స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లలో తనకు సాటి లేదనే రేంజ్ లో నటించాడు. ఇలాంటి విలన్, హీరో గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఒకప్పుడు మంచి మంచి సినిమాల్లో నటించి తన మార్క్ ను పెంచుకుంటూ పోయిన రానా ఓ రెండు సంవత్సరాల నుంచి పెద్దగా కనిపించలేదు. అయితే దాదాపు రెండేళ్ల తరువాత వెండితెర మీద లెంగ్తీ రోల్‌లో కనిపించారు. వేట్టయన్ సినిమాతో రజనీకాంత్‌ను ఢీ కొనే ప్రతినాయకుడిగా అభిమానులతో పవర్ ఫుల్ రోల్‌లో వావ్ అనిపించేశారు. ఈ సినిమా చూశాక రానా తన కెరీర్‌లో బిగ్ టర్న్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా మొదట్లో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు.
ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు రానా. కానీ ఈ హీరో అప్పుడే తన మెయిన్ టార్గెట్ హీరోనే అని క్లారిటీగా చెప్పారు. తాను ఒకటి అనుకుంటే దైవం మరొకటి చేసినట్టు.. బాహుబలి ఆ లెక్కలు మార్చేసింది. కానీ ఈ సినిమాతో ఒక్కసారిగా రానా గురించి, ఆయన నటన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఈ సినిమా మంచి పేరును సంపాదించి పెట్టిందనే చెప్పాలి. బాహుబలి సినిమాలో ప్రతినాయకుడిగా రానా నటనకు ఇండియన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు. బాహుబలిని ఎదిరించే కటౌట్ అంటే ఇలాగే ఉండాలి అనేలా నటించారు ఈ స్టార్ హీరో.
బాహుబలి సినిమా రిలీజ్ టైమ్‌లో రానా ఇక విలన్ రోల్స్‌కు మాత్రమే పరిమితం అవుతారా? ఆ టర్న్ తీసుకుంటారా? అన్న చర్చ కూడా సాగింది. కానీ రానా మాత్రం తన మెయిన్ ప్రిఫరెన్స్ హీరో క్యారెక్టర్స్ కే అని మళ్లీ మళ్లీ క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ వేట్టయన్‌లో రానా ప్లే చేసిన క్యారెక్టర్ మరోసారి రానా మూవీ సెలక్షన్ గురించి డిస్కషన్‌కు తెర లేపేలా చేసింది. ఈ సినిమాలో స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నారు రానా అనడంలో సందేహం లేదు. ఇక పాన్ ఇండియా మూవీస్‌కు భల్లాలదేవ, విలన్‌గా మరో బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు అంటున్నారు విశ్లేషకులు. మరి ముందు ముందు ఈ విలన్ హీరో ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.