Under 19 World Cup: టీమిండియా అండర్ – 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం(ఫిబ్రవరి 6న) పరిగిన సెమీ ఫైనల్‌లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. తొమ్మిదోసారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌ఆఫ్రికా 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ 76 పరుగులు, సెలెట్‌స్వాన్ 64 పరుగులు చేశారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 32 పరుగలకే నాలుగు వికెట్లోల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరాన్ జట్టుకు అండగా నిలిచారు. సచిన్ దాస్ 96, ఉదయ్ సహరాన్ 81 పరుగులు చేశారు. దీంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది. రెండు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది.
రికార్డులు ఇవీ..
– ఇక టీమిండియా అండర్ – 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం ఇది 9వ సారి. ఇందులో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది.
– 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ సారథ్యంంలో మొదటిసారి టీమిండియా అండర్ – 19 వరల్డ్ కప్ గెలిచింది. ఇందులో యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించాడు.
– తర్వాత 2008 విరాట్ కోహ్లి కెప్టెనీలలో రెండోసారి టీమిండియా అండర్ – 19 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
– 2012లో మూడోసారి ఉన్‌ముక్త్‌చంద్ సారథ్యంలో మూడోసారి టీమిండియా వరల్డ్ కప్ అండర్ – 19 విన్నర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 225 పరుగులు చేయగా, టీమిండియా కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోలోపయి టార్గెట్ ఛేదించింది.
– 2018లో టీమిండియా నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ జట్టుకు పృథ్వీషా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.
– 2022లో ఐదోసారి భారత జట్టు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది. ఈ సిరీస్‌లో టీమిండియా ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడింది. నాలుగు వికెట్ల తేడాలో విజయం సాధించింది.